చిరు టార్గెట్ అదేనట…

chiru

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. బీట్ చేస్తే బాహుబలి రికార్డుల్నే క్రాస్ చేయాలి. ప్రస్తుతం మెగా స్టార్ ఇదే టార్గెట్ పెట్టుకున్నాడట. తన 150వ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న చిరంజీవి.. ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి రికార్డును అధిగమించాలని కంకణం కట్టుకున్నాడట. దానికి సంబంధించి ఇప్పటికే తెరవెనక పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. అత్యథిక థియేటర్లలో విడుదల చేయడంతో పాటు… అవసరమైతే టిక్కెట్ రేట్లు పెంచి వసూళ్లలో కొత్త రికార్డు సృష్టించాలని అనుకుంటున్నాడట.

బాహుబలి సినిమా తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయం సాధించింది. ఇది ఏ రేంజ్ లో సక్సెస్ అయింది అంటే.. ఈ సినిమా వసూళ్లు పక్కనపెట్టి.. నాన్-బాహుబలి రికార్డు అంటూ కొత్త లెక్కలు చెప్పుకుంటున్నారు. బాహుబలి సినిమాను మినహాయిస్తూ రికార్డులు లెక్కలేసుకుంటున్నారు. ప్రస్తుతం సూపర్ డూపర్ హిట్స్ అని చెప్పుకుంటున్న జనతా గ్యారేజ్, సరైనోడు, శ్రీమంతుడు లాంటి సినిమాలన్నీ నాన్-బాహుబలి రికార్డులే. అదీ ఈ సినిమా స్టామినా. అలాంటి సినిమాను ఢీకొట్టాలని ఇప్పుడు మెగాస్టార్ ఫిక్స్ అయిపోయాడు.

చిరంజీవి సినిమాకు సంబంధించి ఇప్పుడు రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. నైజాంతో పాటు దాదాపు కీలకమైన అన్ని ప్రాంతాల్లో బిజినెస్ పూర్తయింది. మరోవైపు థియేటర్లకు సంబంధించి సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి కీలకమైన వ్యక్తులతో చిరంజీవి చర్చలు కూడా జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి రికార్డులు కొట్టాలనేదే ఇప్పుడు చిరు టార్గెట్. అయితే ఆ సినిమా సృష్టించిన ఓవరాల్ రికార్డుల్ని మాత్రం చిరంజీవి కూడా టచ్ చేయలేరు. ఇది నగ్న సత్యం. ఎఁదుకంటే.. బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా 650కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Loading...

Leave a Reply

*