వినాయక్‌కి డెడ్‌లైన్ ఫిక్స్ చేసిన మెగాస్టార్‌..!

chiru-fixed-target-for-khaidi-no-150-release

గ్యాప్ ను ఎలా భర్తీ చేయాలో చిరంజీవికి బాగా తెలుసు. మొన్నటివరకు సినిమా అసలు సెట్స్ పైకే రాలేదన్నారు. సెట్స్ పైకి వచ్చిన తర్వాత హీరోయిన్ సెలక్ట్ కాలేదన్నారు. ఇలా చిరు 150వ సినిమా సెట్స్ పైకి రావడానికి చాలా టైం తీసుకుంది. కానీ షూటింగ్ ప్రారంభం అయ్యాక ఆ గ్యాప్ ను ఎలా భర్తీ చేయాలో చిరంజీవికి బాగా తెలుసు. అందుకే ఓవైపు షూటింగ్ చేస్తూనే…మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాడు చిరంజీవి.

ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. వరుసపెట్టి షెడ్యూల్స్ కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా… సినిమాకు సంబంధించి చిరంజీవి డబ్బింగ్ కూడా ప్రారంభించారు. ఓవైపు షూటింగ్ చేయడం… సాయంత్రం డబ్బింగ్ చేయడం… ఇలా రెస్ట్ లేకుండా సినిమాను కంప్లీట్ చేస్తున్నారట చిరంజీవి. తారాగణం, లొకేషన్లు, యూనిట్ అంతా సెట్ అయిపోవడంతో.. సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు చిరంజీవి.

అయితే ఇలా ఒకేసారి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తిచేయడం వెనక ఓ బలమైన కారణం ఉంది. అదే ప్రచారం. చివరి నిమిషం వరకు షూటింగ్ పూర్తిచేసి, ప్రచారాన్ని గాలికి వదిలేయకుండా… కనీసం ఒక నెల రోజుల పాటు ఎక్స్ క్లూజివ్ గా 150వ సినిమాకు ప్రచారం కల్పించాలని చిరు అండ్ కో భావిస్తోంది. అందుకే షూటింగ్ ను వీలైనంత తొందరగా పూర్తిచేసి, యూనిట్ అంతా ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోవాలని చూస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రానుంది. ఇలా చిరంజీవి ప్ర‌తి ప‌నికీ షెడ్యూల్ ఫిక్స్ చెయ్య‌డంతో వినాయ‌క్ స‌త‌మ‌త‌మ‌వుతున్నాడ‌ట‌. అన్ని ప‌నుల‌ను తానే ద‌గ్గ‌రుండి చూసుకొని రావాల్సి వ‌స్తోంది. దీంతో, వినాయ‌క్ తీరిక‌లేని షెడ్యూల్‌తో బిజీబిజీగా ఉన్నాడ‌ట‌. మ‌రోవైపు, చిరునే ఫాలో అప్ చెయ్య‌డంతో త‌న ప‌ని ఈజీ అవుతోంద‌ని భావిస్తున్నాడ‌ట వినాయక్‌.

Loading...

Leave a Reply

*