ఊర మాస్ దర్శకుడు ఫిక్స్ అయ్యాడు…

chiru

తెలుగులో ఊరమాస్ దర్శకుడు అనే టైటిల్ ఒకే ఒక్కరికి దక్కుతుంది. ఆ పేటెంట్ రైట్స్ అన్నీ బోయపాటివే. అవును.. బోయపాటి అంత ఊరమాస్ దర్శకుుడ టాలీవుడ్ లో ప్రస్తుతం మరొకరు లేరు. అందుకే బోయపాటితో సినిమాలు చేసేందుకు మన మాస్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బోయపాటి-మహేష్ కాంబినేషన్ లో ఓ మూవీ ఉంటుందని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. కానీ మహేష్ మాత్రం మరోసారి కొరటాలకు ఛాన్స్ ఇచ్చాడు.

అటు బోయపాటి కూడా మెగా కాంపౌండ్ లో లాక్ అయిపోయాడు. బన్నీతో సరైనోడు సినిమా చేసిన బోయపాటి… త్వరలోనే చిరంజీవితో ఓ మూవీ చేయబోతున్నాడు. మొన్నటివరకు రూమర్ గా ఉన్న ఈ వార్త ఇప్పుడు పక్కా అయింది. చిరు-బోయపాటి కాంబో కన్ ఫర్మ్ అయింది. చిరంజీవి 151వ సినిమాను హ్యాండిల్ చేసేది బోయపాటే. ఈ మేరకు బోయపాటికి అడ్వాన్స్ కూడా అందించాడు నిర్మాత అల్లు అరవింద్.

ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ కొడుకుతో సినిమా చేస్తున్నాడు బోయపాటి. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి, చిరంజీవి 151వ సినిమాపై ఫోకస్ పెడతాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే చిరంజీవికి వినిపించిన స్టోరీలైన్ నచ్చడంతో… దాన్ని స్క్రీన్ ప్లే రూపంలో తీసుకొచ్చేందుకు బోయపాటి ప్రయత్నిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో చిరు-బోయపాటి సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Loading...

Leave a Reply

*