ఆ పని కూడా ప్రారంభించిన ఖైదీ

chi

ఎంట్రీలో కాస్త టైం గ్యాప్ ఉండొచ్చేమో కానీ.. టైమింగ్ లో మాత్రం ఎలాంటి గ్యాప్ ఉండదు చిరంజీవికి. ఖైదీ నంబర్-150లో అదే జరిగింది. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అని అంతా ఎదురుచూశారు. కానీ చిరంజీవి చాన్నాళ్లు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. చివరికి ముహూర్తం షాట్ అయిపోయిన తర్వాత కూడా సైలెంట్ అయిపోయాడు. అలాంటి చిరు ఇప్పుడు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు.ఖైదీ నంబర్150 సినిమాను దాదాపు పూర్తిచేశాడట చిరంజీవి. అవును… ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70శాతం కంప్లీట్ అయిందని చెబుతున్నాడు చిరు తనయుడు, సినిమా నిర్మాత రామ్ చరణ్.

మరో 30శాతం కంప్లీట్ చేయడానికి మహా అయితే 40రోజుల టైం చాలంటున్నాడు. ఇదేకాకుండా… ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ కూడా మోసుకొచ్చాడు.తన 150వ సినిమాకు సంబంధించి చిరంజీవి అప్పుడే డబ్బింగ్ కూడా ప్రారంభించాడట. అవును.. పోస్ట్ ప్రొడక్షన్ ఫేజ్ లోకి కూడా ఎంటరైంది 150వ సినిమా. వీలైనంత తొందరగా సినిమాను కంప్లీట్ చేసి, ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా ఓ 15 రోజులు కేటాయించాలని చిరు అండ్ టీం భావిస్తోందట. అంతకంటే ముందు ఆడియోతో అభిమానులకు విందు ఇవ్వాలని కూడా చిరు-చెర్రీ భావిస్తున్నారు.

Loading...

Leave a Reply

*