మెగాస్టార్ నిజంగానే ఆపద్బాంధవుడే…

k

చిరంజీవి 150వ సినిమా కోసం హీరోయిన్ ను వెదకడానికి టోటల్ టీం అంతా ఎంత కష్టపడిందో మనందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది కానీ హీరోయిన్ మాత్రం దొరకలేదు. దేశమంతా జల్లెడ పట్టారు హీరోయిన్ కోసం. ఎట్టకేలకు రామ్ చరణ్ లాబీయింగ్ తో చిరు సరసన హీరోయిన్ గా నటించేందుకు కాజల్ ఒప్పుకుంది. కానీ చిరంజీవితో సినిమా చేస్తే, మెగా హీరోలతో పాటు మిగతా కుర్రహీరోలు ఎవరూ తనకు మళ్లీ ఛాన్సులు ఇవ్వరనే విషయ కాజల్ కు తెలుసు. అది నిజమైంది కూడా.

కాజల్ ను మరోసారి కన్సిడర్ చేయడానికి బన్నీ ఒప్పుకోలేదు. తన కొత్త సినిమాలో వేరే అమ్మాయిని తీసుకున్నాడు. అటు చరణ్ కూడా తండ్రితో చేసిన హీరోయిన్ ను మళ్లీ రిపీట్ చేయడానికి ఇష్టపడలేదు. ఇక పవన్ కల్యాణ్ సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏ హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తాడో చెప్పలేం. దీంతో కాజల్ కెరీర్ అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి కాజల్ ను ఆదుకునేందుకు చిరంజీవి రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం చేస్తున్న 150వ సినిమాతో పాటు 151వ సినిమాలో కూడా కాజల్ నే హీరోయిన్ గా తీసుకునేందుకు చిరంజీవి నిర్ణయించుకున్నాడట. 150వ సినిమా కంప్లీట్ అవ్వగానే, బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు చిరంజీవి రెడీ అవుతున్నాడు. ఆ సినిమాలో కూడా కాజల్ నే రిపీట్ చేసేందుకు మెగాస్టార్ మొగ్గుచూపుతున్నాడట.

Loading...

Leave a Reply

*