చెర్రీని చూసి అంతా పప్పులో కాలేశారు…

cherri

అవును… రామ్ చరణ్ ను చూసి అంతా పప్పులో కాలేశారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా చేస్తున్నాడు చరణ్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఒక సాంగ్, కొన్ని సీన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిని కూడా ఈ 10 రోజుల్లో పూర్తిచేసి, వచ్చేనెల 2న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఇదిలా ఉండగా… మిగిలిన ఆ ఒక్క పాట కోసమే చెర్రీ సిక్స్ ప్యాక్ ట్రైచేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. చరణ్ జిమ్ లో ఎక్సర్ సైజులు చేస్తున్న వీడియోలు, కండలు చూపిస్తున్న ఫొటోలు తెగ హంగామా చేశాయి. ఈ సిక్స్ ప్యాక్ బిల్డప్ కోసం స్వయంగా సల్మాన్ ఖాన్ కు ట్రయినింగ్ ఇచ్చిన శిక్షకుడ్ని హైదరాబాద్ కు రప్పించారనే వార్తలు కూడా వచ్చాయి.

ఇవన్నీ నిజమే.. చెర్రీ సిక్స్ ప్యాక్ చేస్తోంది వాస్తవమే. సల్మాన్ ట్రయినరే చెర్రీకి కూడా సహాయపడుతున్నాడనేది కూడా నిజమే. కానీ ఇక్కడ అంతా భ్రమపడుతున్న విషయం వేరే ఉంది. ధృవలో మిగిలిన ఆ ఒక్క పాట కోసం చెర్రీ ఇంత కష్టపడడం లేదట. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో సెట్స్ పైకి రాబోతున్న నయా మూవీ కోసమే చెర్రీ ఈ సిక్స్ ప్యాక్ సాధిస్తున్నాడట.

కేవలం ఒక్క పాట కోసం ఇంత కష్టపడి సిక్స్ ప్యాక్ చేయడం ఏంటనే అనుమానం చాలామందికి వచ్చింది. ఎందుకంటే.. చరణ్ కు ఇప్పటికే కండలు తిరిగిన దేహం ఉంది. కావాలంటే ఆ కండలతోనే పాటను లాగించేయొచ్చు. 5 నిమిషాల పాట కోసం 5నెలల పాటు కష్టపడి సిక్స్ ప్యాక్ చేయనక్కర్లేదు. కానీ చెర్రీ చేస్తున్నాడంటే దానికి కారణం ఇంకేదో ఉందని అంతా అనుమానించారు. ఆ అనుమానమే ఇప్పుడు నిజమైంది.

Loading...

Leave a Reply

*