ఈ దర్శకుడు అందర్నీ కెలికేస్తున్నాడుగా…

untitled-3

ఒక్క హిట్ కొట్టాడో లేదో… అప్పుడే హీరోలందర్నీ కెలికి వదిలేస్తున్నాడు దర్శకుడు చందు మొండేటి. రీమేక్ సినిమా ప్రేమమ్ తో హిట్ కొట్టిన ఈ దర్శకుడు రవితేజతో సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అంతకంటే ముందు నాగార్జున, వెంకటేష్ కోసం కూడా కథలు రెడీ చేసినట్టు చదువుకున్నాం. కానీ తాజాగా చందు మొండేటి మరో స్టార్ హీరోను కూడా కలిశాడట. అతడు మరెవరో కాదు… జనతా గ్యారేజ్ తో బిగ్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.

తారక్ ను ఈమధ్య కలిశాడట చందు మొండేటి. తన దగ్గరున్న 2 సైన్స్ ఫిక్సన్ కథల్ని అతడికి వినిపించాడట. ప్రస్తు యంగ్ టైగర్ రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరు ఏ కథ చెప్పినా ఒప్పుకోవడం లేదు. వక్కంతం వంశీ, పూరి జగన్నాధ్. అనిల్ రావిపూడి… ఇలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఈ టైమ్ లో సరిగ్గా తారక్ కు మన మొండేటి కనెక్ట్ అయ్యాడు.

కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాల కోసం తారక్ వెయిటింగ్. అటు చందు మొండేటి కూడా కాస్త డిఫరెంట్ గా ఉండే కథల్నే ఎఁచుకుంటాడు. సో.. ఈ దర్శకుడు చెప్పిన రెండు కథల్లో ఎన్టీఆర్ కు ఏమైనా నచ్చిందా అనేది పెద్ద డౌట్. ప్రేమమ్ దర్శకుడికి తారక్ ఛాన్స్ ఇస్తాడా… లేక తన పాత దర్శకుల మాదిరిగానే వెయిటింగ్ లిస్ట్ లో పెడతాడా అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*