ఆ లేడీ ఎమ్మెల్యే బ‌న్నీని ఎంత ప‌ని చేసింది..?

untitled-33

చిరంజీవి 150వ సినిమాలో క్యాథరీన్ ను తీసుకున్నారనే టాక్ వచ్చిన వెంటనే అంతా బన్నీ వైపే చూశారు. ఎందుకంటే…బన్నీకి క్యాథరీన్ చాలా క్లోజ్. పైగా సరైనోడు సినిమాలో క్యారెక్టర్ చూసిన తర్వాతే క్యాథరీన్ కు చిరు ఛాన్స్ ఇచ్చాడని అంతా చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు అదే ట్యాగ్ లైన్ మూలంగా క్యాథరీన్ మెగా కాంపౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయిందనే టాక్ బాగా వైరల్ అవుతుంది. దీంతో బన్నీకి ఈ వ్యవహారం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.

ఖైదీ నంబర్-150 సెట్స్ లో చిరు తనయ సుష్మితకు క్యాథరీన్ కు గొడవ జరిగిందనే టాక్ నడుస్తోంది. సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న సుష్మిత… క్యాథరీన్ ఐటెంసాంగ్ కోసం కూడా డ్రెస్సులు రెడీ చేసింది. అయితే వాటిలో ఏ ఒక్కటి బాగాలేదని క్యాథరీన్ గొడవ చేసిందట. విషయం కాస్తా చినికి చినికి గాలివానగా మారడంతో అది క్యాథరీన్ ను బయటకు పంపించే వరకు వెళ్లిందట. ఇప్పటివరకు చెప్పుకుంటున్న మేటర్ ఇది. కానీ అసలు కథ ఇంకోటి ఉందని తాజాగా వెలుగులోకి కొన్ని వార్తలు వస్తున్నాయి.

కేవలం బన్నీమీద కోపంతోనే క్యాథరీన్ ను తప్పించారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పవన్ కల్యాణ్ కు దూరంగా ఉంటున్నాడు బన్నీ. చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన బన్నీ… ఇప్పుడు మెగాస్టార్ కుటుంబంతో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. బన్నీ హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న క్యాథరీన్ ను సెట్స్ నుంచి బయటకు పంపిించేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీంతో బన్నీకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈ ఇష్యూను ఎలా హ్యాండిల్ చేయాలో తెలీక బన్నీ సతమతమవుతున్నాడట.

Loading...

Leave a Reply

*