మెగా డాట‌ర్ వ‌ర్సెస్ బ‌న్ని భామ త‌ప్పెవ‌రిది…?

untitled-19

మెగా డాట‌ర్ సుష్మిత వ‌ర్సెస్ బ‌న్ని హీరోయిన్ కేథ‌రిన్ ట్రెసా.. ఇద్ద‌రి మ‌ధ్య ఏం జరిగిందో కానీ.. నిన్న సోష‌ల్ మీడియా మొత్తం వీరిఫైట్ గురించే హాట్ హాట్ డిస్క‌ష‌న్ సాగింది. ఇద్ద‌రి మ‌ధ్య అస‌లు గొడ‌వ‌కు కార‌ణ‌మేంట‌నే చ‌ర్చ న‌డిచింది. అయితే, ఖైదీ నెంబ‌ర్ 150 వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం.. ఈ సినిమాకి స్ట‌యిలిస్ట్‌గా చిరంజీవి గారి పెద్ద‌మ్మాయి సుష్మిత చేస్తున్నారు. ఆమె గ‌తంలో ఫ్యాష‌న్ డిజైనింగ్ కోర్స్ చేశారు. ఆ త‌ర్వాత కుటుంబ వ్య‌వ‌హారాల‌కే ప‌రిమిత‌మైన సుష్మిత ఇటీవల స్ట‌యిలిస్ట్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. దీంతో, చిరంజీవితో పాటు ఖైదీ నెంబ‌ర్ 150 మూవీలోని ఇత‌ర కేర‌క్ట‌ర్‌లు, హీరోయిన్‌ల డ్ర‌స్ డిజైన్‌లు కూడా ఆవిడే చూసుకుంటున్నార‌ట‌.

అయితే, ఖైదీ నెంబ‌ర్ 150కి చిరంజీవి కాస్ట్యూమ్స్‌ని ఆవిడే డిజ‌యిన్ చేస్తున్నారు. సినిమా యూనిట్‌కి మాత్రం గ‌త కొంత‌కాలంగా మెగా ఫ్యామిలీకి స్ట‌యిలిస్ట్‌గా ఉన్న ఇంద్రాణీ అనే డిజైన‌ర్ డ్ర‌స్సుల‌ను స‌మ‌కూరుస్తున్నారట‌. వాటిని కూడా సుష్మిత‌నే ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని స‌మాచారం. ఖైదీ నెంబ‌ర్ 150లో కేథ‌రిన్ ఐటెం సాంగ్‌కి సైన్ చేసింది. ఆ పాటలో వేసుకోవాల్సిన డ్ర‌స్‌ల‌ను అప్ప‌టికే ఇంద్రాణీ డిజైన్ చేసి రెడీ చేశార‌ట‌. సెట్స్‌పైకి వచ్చిన త‌ర్వాత తీరా ఇంద్రాణీ టీమ్ డిజైన్ చేసిన డ్ర‌స్‌లు బాగా లేవ‌ని, వాటిని వేసుకోన‌ని చెప్పింద‌ట కేథ‌రిన్‌. దీంతో, ర‌గ‌డ మొద‌ల‌యింద‌ట‌.

ఈ విష‌యంపై అటు సుష్మిత కూడా స‌ర్దిచెప్పే య‌త్నం చేసినా కేథ‌రిన్ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేద‌ట‌. నాకు న‌చ్చ‌లేదు.. వేసుకోనంటే వేసుకోన‌ని మంకు ప‌ట్టి ప‌ట్టింద‌ట‌. దీంతో, ఇక చేసేదేమీ లేక కేథ‌రిన్‌ని త‌ప్పించార‌ని స‌మాచారం. అయితే, దీనిపై భిన్న వాదన‌లు వినిపిస్తున్నాయి. కేవ‌లం డ్ర‌స్‌ల విష‌యంలోనే ర‌గ‌డ అయితే ఇటు సుష్మిత‌, అటు కేథ‌రిన్ ఎవ‌రిలో ఒక‌రు త‌గ్గితే స‌రిపోయేద‌ని చెబుతున్నారు. ఆమెకు డ్ర‌స్‌లు న‌చ్చ‌క‌పోతే మార్చి చూద్దాం అంటే పోయేదని కొంద‌రు సుష్మిత‌కు స‌ల‌హా ఇస్తుంటే.. మ‌రికొంద‌రు కేథ‌రిన్‌ని త‌ప్పు ప‌డుతున్నారు.

డ్ర‌స్ విష‌యంలో సెట్ బ్యాక్ గ్రౌండ్‌, హీరోతోపాటు జూనియ‌ర్ ఆర్టిస్ట్‌ల కాస్ట్యూమ్ కూడా ఒకేసారి డిజైన్ చేస్తార‌ని, అలాంటి టైమ్‌లో బాగా వేవ‌ని చెప్ప‌డం త‌గ‌ద‌ని మ‌రికొంద‌రు స‌జెష‌న్స్ ఇస్తున్నారు.లాస్ట్ మినిట్‌లో ఏదో జ‌రిగిందేదో జ‌రిగిపోయింద‌ని స‌ర్దిచెప్పుకున్నా స‌రిపోయ‌దని, కాంప్ర‌మైజ్‌కి చాన్స్ ఉన్న అంశంలో ఇలా తెగేదాకా లాగ‌డం క‌రెక్ట్ కాద‌నేది ఇంకొంద‌రి మాట‌. మొత్త‌మ్మీద‌, చిన్న చిన్న విష‌యాల ద‌గ్గ‌ర ర‌చ్చ కావ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అయితే, ఇద్ద‌రిలో త‌ప్పెవ‌రిది..? అంటే మాత్రం ఎవ‌రి వాద‌న‌లు వారికి ఉన్నాయంటున్నారు ఖైదీ నెంబ‌ర్ 150 వ‌ర్గాలు.

Loading...

Leave a Reply

*