మెగా ఫ్యామిలీతో పెట్టుకుంది..ఇక ఔట్..!

untitled-35

మెగా కాంపౌండ్ తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చాలామందికి తెలుసు. గతంలో చాలమంది నటీనటులు, టెక్నీషియన్లకు ఇది అనుభవమే. అందుకే అక్కసు ఉన్నా కడుపులోనే దాచుకుంటారు తప్ప బయటకు వెళ్లగక్కరు. మోస్ట్ పవర్ ఫుల్ కాంపౌండ్ గా పేరున్న మెగా కాంపౌండ్ గురించి ఎవరూ నెగెటివ్ గా మాట్లాడారు. అలా మాట్లాడేవారు అన్నింటికీ తెగించి మాట్లాడుతున్నారని అర్థం. ఇప్పుడు క్యాథరీన్ విషయంలో ఏం జరుగుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

తెలుగులో ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. కెరీర్ మెల్లమెల్లగా పుంజుకుంటోంది. ఇలాంటి టైమ్ లో చిరు ప్రాజెక్ట్ నుంచి క్యాథరీన్ బయటకు వచ్చేసింది. ఆమె ఇలా కాలు బయటపెట్టినప్పటి నుంచి ఆమెకు వ్యతిరేకంగా వరుసగా స్టోరీలు వచ్చేస్తున్నాయి. ఆమె పాత్ర ఎంత ఉందనే విషయం పక్కనపెడితే… అంతా ఆమే చేసింది అనే యాంగిల్ లో కథనాలు పుట్టుకొస్తున్నాయి. దీంతో క్యాథరీన్ కెరీర్ ఇప్పుడు డైలమాలో పడింది.

నిజంగా క్యాథరీన్ పై మెగా కాంపౌండ్ దృష్టిపెడితే మాత్రం ఆమెకిక తెలుగులో అవకాశాలు రావు. ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టుల నుంచి కూడా ఆమెను తీసేయడం ఖాయం. మొన్నటికి మొన్న షకలక శంకర్ విషయంలో కూడా అదే జరిగింది. పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడాడనే ఒకేఒక్క రూమర్ కారణంగా అతడికి దాదాపు ఏడాది పాటు అవకాశాలు లేకుండా చేశారు. ఇప్పుడు క్యాథరీన్ పరిస్థితి ఏంటనేది అగమ్యగోచరంగా మారింది. తెలుగులో ఆమె ఫ్యూచర్ ఏంటనేది త్వరలోనే తేలిపోనుంది. నిజంగా మెగా కాంపౌండ్ ఆమెపై టార్గెట్ ఫిక్స్ చేస్తే… క్యాథరీన్ ఇక పెట్టీబెడా సర్దుకోవడం బెటర్ అనే టాక్ వినిపిస్తోంది.

Loading...

Leave a Reply

*