చైతుకి షాక్‌.. ప్రేమ‌మ్‌కి ఆ మార్క్ క‌ష్ట‌మేన‌ట‌గా..!

untitled-13

ప్రస్తుతం పరిశ్రమలో ప్రిస్టీజియ‌స్ క్ల‌బ్ అనేది ఒక‌టి ఉంది. ఆ క్ల‌బ్‌లో ఎంట్రీ ఇవ్వాల‌ని ప్ర‌తి హీరో ఉబ‌లాట ప‌డుతుంటాడు. ప్ర‌తి హీరో రెండు ప్రామాణికాలను అందుకోవాల‌ని ఆరాట ప‌డుతుంటాడు. ఒకటి ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైపోవాలి. రెండు… డొమస్టిక్ మార్కెట్లో 40కోట్ల రూపాయల వసూళ్లను అందుకోవాలి. ఈ రెండూ సాధించినప్పుడు మాత్రమే ఆ సినిమాను హిట్ మూవీగా లెక్కిస్తున్నారు ట్రేడ్ పండిట్స్. అయితే ప్రేమమ్ విషయంలో మాత్రం ఈ లెక్కల్ని పక్కనపెడుతున్నారు. లెక్కల సంగతి ఎలా ఉన్నా.. సినిమా చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు.నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమా కథతో సంబంధం లేని మూవీ. అది ఎమోషన్స్ తో కనెక్ట్ అయిన సినిమా.

ఇలాంటి సినిమాకు కోట్లకు కోట్లు కలెక్షన్లు రావాలని ఆశించడం అత్యాశే అవుతుంది. అలాఅని వసూళ్లు రాలేదని ఫ్లాప్ అని చెప్పలేం. అందరికీ నచ్చుతుంది. అలా ఓ డిఫరెంట్ సెగ్మెంట్ కిందకు ప్రేమమ్ ను చేర్చాలి. అందుకే లోకల్ మార్కెట్లో ఇది 40కోట్ల మార్క్ ను అందుకోవడం కష్టమే అయినప్పటికీ.. సినిమాని హిట్ గా డిక్లేర్ చేస్తున్నారు.అటు ఓవర్సీస్ లో మాత్రం ప్రేమమ్ సినిమా 10లక్షల డాలర్ల కలెక్షన్లు అందుకునే దిశగా దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో దసరా బరిలో నిలిచిన ఈ మూవీకి డీసెంట్ వసూళ్లు మాత్రం వస్తున్నాయి. అయితే మిగతా హీరోల్లా నాగార్జున మాత్రం.. తన కొడుకు సినిమాకు లేనిపోని లెక్కలు చెప్పుకోడు. ఆ యాంగిల్ లో కూడా ప్రేమమ్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

Loading...

Leave a Reply

*