నంద‌మూరి హీరోని కాష్మోరా ప‌ట్టి పీడిస్తుందా..?

kashmora

చూస్తుంటే ఇదే నిజ‌మ‌య్యేలా క‌నిపిస్తోంది. సూర్య బ్ర‌ద‌ర్ కార్తి.. క‌ల్యాణ్‌రామ్ ఇజంకి స్పాట్ పెట్టేలా క‌నిపిస్తున్నాడు. గ‌త వీకెండ్‌కానుక‌గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఇజం మంచి టాక్ పొందింది. ఓపెనింగ్స్‌లోనూ భారీ వ‌సూళ్లు సాధించింది. ఇటు, వీకెండ్ ముగిసిన త‌ర్వాత కూడా క‌ల్యాణ్‌రామ్ ఇజం వ‌సూళ్లు ఏమాత్రం ప‌డిపోలేదు. సోమ‌వారం, మంగ‌ళ‌వారం కూడా క‌లెక్ష‌న్లు డ్రాప్ కాలేదు. అందుకే, తొలి మూడు రోజుల‌కు ఇజం క‌లెక్ష‌న్‌లు 7 కోట్లు క‌లెక్ట్ చేసిన ఇజం, సోమ‌వారం, మంగ‌ళ‌వారం క‌లిపి మ‌రో 3 కోట్లు సాధించింది. క‌ల్యాణ్‌రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్‌.

ఇప్ప‌టిదాకా క‌ల్యాణ్‌రామ్ కెరీర్‌లో అతి పెద్ద విజ‌యం ప‌టాస్‌. అది సుమారు 16 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఈ వీకెండ్‌కి ఆ మార్క్‌ని ఈజీగా రీచ్ అయ్యేలా క‌నిపిస్తోంది. క‌ల్యాణ్‌రామ్ ఆల్‌టైమ్ రికార్డ్‌ని ఇజం ఈజీగా క్రాస్ చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు భావిస్తున్నాయి. అయితే, జోష్‌లో ఉన్న క‌ల్యాణ్‌రామ్‌కి సూర్య బ్ర‌ద‌ర్ కార్తి దెబ్బేసేలా ఉన్నాడు. ఈ వీకెండ్ కానుక‌గా విడుద‌ల కానుంది కార్తి కాష్మోరా. హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. టీజ‌ర్‌తోనే అంద‌రినీ క‌ట్టిప‌డేసింది కాష్మోరా. ఇటీవ‌లే ఈ సినిమా టీజ‌ర్.. 50ల‌క్ష‌ల వ్యూస్‌ని కూడా పొందింది.

ఇజం సినిమాకి దీపావ‌ళి వీకెండ్ కూడావ‌స్తుంద‌ని భావించారు. కానీ, ఈ వీకెండ్‌కి కాష్మోరా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఇజం వ‌సూళ్ల‌ను డౌన్ అయ్యేలా చేస్తుంది. మ‌రి, ఈ నంద‌మూరి హీరోని కార్తి కాష్మోరా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌ట్టి పీడిస్తుందా? లేదా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*