బ‌న్ని న్యూస్ రిల‌య‌న్స్ అంబానీ వెబ్‌సైట్‌లో..!

bunny

స్ట‌యిలిష్ స్టార్ అల్లు అర్జున్ సంచ‌ల‌నం క్రియేట్ చేశాడు. కోలీవుడ్‌లో సినిమాకి సైన్ చేసి.. అక్క‌డే త‌న సినిమాని లాంచ్ చేసిన హీరోగా బ‌న్ని కొత్త రికార్డ్ న‌మోదు చేశాడు. ఇప్ప‌టికే మ‌ల్లూవుడ్‌లో స‌క్సెస్ ఫుల్ హీరోగా మార్కెట్ ద‌క్కించుకున్న స్ట‌యిలిష్ స్టార్‌, తాజాగా త‌న స్టార్‌డ‌మ్‌ని సౌత్ వ్యాప్తంగా పెంచుకునే ప‌నిలో ప‌డ్డాడు. క‌ర్నాట‌క‌లో బ‌న్నికి మంచి ఫాలోయింగ్ ఉంది. త‌మిళ్‌లోనూ క్రేజ్ ద‌క్కితే..బ‌న్ని మార్కెట్ మ‌రో 20 శాతం పెర‌గ‌డం గ్యారంటీ. ఇదే ఇప్పుడు ఆయ‌న టార్గెట్‌. అందుకే, కోలీవుడ్ మాస్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ సినిమాకి ప‌చ్చ‌జెండా ఊపాడు. అది త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి రానుంది.

కోలీవుడ్‌లో బ‌న్ని ఎంట్రీ సౌత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్ప‌టిదాకా త‌మిళ్ హీరోలు మాత్ర‌మే తెలుగుతోపాటు సౌత్‌లోని ఇత‌ర భాష‌ల‌లో ప్రెస్‌మీట్‌లు, సినిమా ఆడియో ఫంక్ష‌న్‌ల వంటి వాటిని ప్ర‌మోట్ చేసేవారు. చాలా గ్యాప్ త‌ర్వాత ఓ టాలీవుడ్ హీరో ఎంట్రీని త‌మిళ్‌లో గ్రాండ్‌గా లాంచ్ చెయ్య‌డం ఇదే మొద‌టిసారి. అందుకే, బ‌న్ని కోలీవుడ్ రాక‌ని స్వాగ‌తిస్తూ.. త‌మిళ్ మీడియాతో పాటు నేష‌న‌ల్ మీడియా కూడా హైలైట్ చేసింది.కోలీవుడ్ వెబ్‌సైట్‌ల‌న్నీ అల్లు అర్జున్ సినిమా న్యూస్‌ని బాగా క్యారీ చేశారు. ఎందుకంటే, బ‌న్ని న‌టిస్తున్న త‌మిళ్ మూవీని నిర్మిస్తోంది కోలీవుడ్ బ‌డా హీరో సూర్య‌, ఆయ‌న బ్ర‌ద‌ర్ కార్తి ఓన్ బ్యాన‌ర్ అని స‌మాచారం.

స్టూడియో గ్రీన్ ప్ర‌మోట‌ర్ కె.ఈ. జ్ఙాన్‌వేల్ రాజా.. సూర్యకి ద‌గ్గ‌రి బంధువు. ఈ బ్యానర్‌ని ఏర్పాటు చేసింది సూర్య‌నే అని చెబుతారు. దీంతో, ఈ న్యూస్‌ని జాతీయ స్థాయి వెబ్‌సైట్‌ల‌లోనూ క‌వ‌ర్ అయ్యేలా ప్లాన్ చేశార‌ట‌. ముఖ్యంగా ముఖేష‌న్ అంబానీదిగా చెప్పుకునే ఓ టాబ్లాయిడ్‌లో ఈ న్యూస్‌ని బాగా క‌వ‌ర్ చేశారు. దీంతో, బ‌న్ని చిత్రానికి రిలీజ్‌కు ముందే భారీ ప్ర‌మోష‌న్ ద‌క్కింది. మొత్త‌మ్మీద‌, స్ట‌యిలిష్ స్టార్ కోలీవుడ్ ఎంట్రీకి గ్రాండ్ వెల్క‌మ్ ల‌భించింది. మ‌రి, అల్లు అర్జున్ దీనిని ఎలా క్యాష్ చేసుకుంటాడో చూడాలి.

Loading...

Leave a Reply

*