తలసాని రిసెప్షన్ సాక్షిగా మెగా చీలిక ..?

untitled-15

తలసాని శ్రీనివాసయాదవ్ ఈమధ్యే తన కూతురు పెళ్లి చేశాడు. హైదరాబాద్ లో రిసెప్షన్ ను గ్రాండ్ గా ఏర్పాటుచేశాడు. రాజకీయ ప్రముఖులు కంటే సినీప్రముఖులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఓ మోస్తరు పేరుతెచ్చుకున్న జబర్దస్త్ నటుల నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు ఎవర్నీ వదల్లేదు. అందర్నీ ఆహ్వానించాడు. ఇన్వైట్ చేయడమే ఆలస్యం.. అంతా ఎటెంట్ అయ్యారు. అయితే ఇదే వేడుక సాక్షిగా మరోసారి మెగా చీలక బయటపడినట్టు తెలుస్తోంది.

మహేష్ బాబు, ఎన్టీఆర్, అఖిల్, మంచు విష్ణు, సునీల్ లాంటి నటులతో పాటు ఈ వేడుకకు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యాడు. తలసాని, పవన్ మధ్య ఉన్న రాజకీయ అనుబంధం కారణంగా పవర్ స్టార్ వచ్చాడు. మరోవైపు పరిశ్రమ నుంచి అల్లు అర్జున్ కూడా దీనికి ఎటెంట్ అయ్యాడు. తండ్రి అల్లు అరవింద్ తో కలిసి బన్నీ రిసెప్షన్ కు వచ్చాడు. సరిగ్గా ఇక్కడే ‘చెప్పను బ్రదర్’ అనే స్లోగన్ మరోసారి తెరపైకి వచ్చిందట.

మొన్నటివరకు పవన్ కల్యాణ్ గురించి ‘చెప్పను బ్రదర్’ అన్న బన్నీ ఈసారి పవన్ ఎదురుపడినప్పటికీ పెద్దగా స్పందించలేదట. రిసెప్షన్ లో ఓ సమయంలో పవన్ కల్యాణ్, బన్నీ ఒకే వరుసలో కూర్చుకున్నారట. కానీ బన్నీ వెళ్లి పవన్ ను విష్ చేయలేదని తెలుస్తోంది. చాలామంది టాలీవుడ్ ప్రముఖులను పలకరించిన బన్నీ… పవన్ ఉన్న వైపు మాత్రం వెళ్లలేదని తెలుస్తోంది. దాసరి లాంటి పెద్ద మనషులు ఆ విషయాన్ని గుర్తుచేసినప్పటికీ… బన్నీ లైట్ తీసుకున్నాడని తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*