ఖాళీ బన్నీ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా…

untitled-2

సరైనోడుకు గుమ్మడికాయ కొట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు బన్నీ. అంటే దాదాపు 2 నెలలుగా బన్నీ పూర్తిగా ఖాళీ. హరీశ్ శంకర్, లింగుస్వామి లాంటి దర్శకులతో సినిమాలు ఎనౌన్స్ చేసినప్పటికీ… వాటిని ఇంకా సెట్స్ పైకి తీసుకెళ్లలేదు బన్నీ. మరి ఈ 2 నెలల్లో అల్లువారబ్బాయ్ ఏం చేశాడు. ఎలా గడిపాడు. దీనికి సింపుల్ ఆన్సర్ నిన్న సోషల్ మీడియాలో దొరికింది.

ఈ ఖాళీ టైం లోబన్నీ పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోయాడు. గర్భవతి అయిన తన భార్యను దగ్గరుండి చూసుకున్నాడు. కొడుకు అయాన్ ను తనే దగ్గరుండి ఆడించాడు. వాడి ఆలనపాలన అన్నీ తనే చూసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ 2 నెలలు ఓ సగటు తండ్రిలా మారిపోయాడు. నిజానికి డీజే సినిమా కోసం బన్నీ ఓ పెద్ద మేకోవర్ లో ఉన్నాడని, అందుకే కెమెరాకు కూడా కనిపించలేదని చాలామంది చెప్పుకొచ్చారు. కానీ బన్నీ మాత్ర సింపుల్ గా తన కొడుకుతో ఆడుకుంటూ ఈ 2నెలలు గడిపేశాడు. తాజాగా కొడుకుతో ఆడుకుంటున్నప్పుడు దిగిన ఫొటోను మీడియాలో కూడా పెట్టాడు.

ఇన్నాళ్లు ఫుల్ గా ఎంజాయ్ చేసిన బన్నీ ఇప్పుడు సెట్స్ పైకి వచ్చేయడానికి రెడీ అయిపోతున్నాడు. మరో 2 రోజుల్లో డీజే షూటింగ్ ప్రారంభించబోతున్నాడు. ఈనెల 20 నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా షెడ్యూల్ మొదలుకానుంది. ఎల్లుండి ప్రారంభం కాబోతున్న ఈ సినిమా షెడ్యూల్, వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగుతూనే ఉంటుందట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. పూజా హెగ్డే హీరోయిన్.

Loading...

Leave a Reply

*