2016 అతి పెద్ద డిజాస్ట‌ర్ మ‌హేష్ సినిమానే.. ఇదో రికార్డ్‌..!

mahesh

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే 2016 ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్ప‌టిదాకా ఏ ఒక్క కాలెండర్ ఇయ‌ర్‌లోనూ జ‌ర‌గ‌ని విధంగా ఏకంగా ఏడు సినిమాలు 50 కోట్ల క్ల‌బ్‌లో ఎంట్రీ ఇచ్చాయి. నాన్న‌కు ప్రేమ‌తో, సోగ్గాడే చిన్నినాయ‌న‌, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌, స‌రైనోడు, ఊపిరి, అ..ఆ, జ‌న‌తా గ్యారేజ్‌..

గ‌తంలో ఏ ఒక్క ఇయ‌ర్‌లోనూ ఇన్ని సినిమాలు ఆ ప్రిస్టీజియ‌స్ క్ల‌బ్‌లో చోటు ద‌క్కించుకోలేక‌పోయాయి.

అయితే, ఇన్ని సినిమాలు ఈ ఏడాది 50 కోట్ల క్ల‌బ్‌లో చేరినా.. ఒక్క మ‌హేష్ మూవీ మాత్రం దానికి ద‌రిదాపుల్లోకి కూడా రాలేక‌పోయింది. ఆ సినిమా ఏంటో స్పెష‌ల్‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. అవును, బ్ర‌హ్మోత్స‌వం. ఎన్నో ఆశ‌లు, అంచ‌నాల‌తో వ‌చ్చిన బ్ర‌హ్మోత్స‌వం టాలీవుడ్‌లో రికార్డులు తిర‌గ‌రాస్తుంద‌ని భావించారు. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు త‌ర్వాత మ‌హేష్‌-శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మూవీ ఇదే. దీంతో, బ్ర‌హ్మోత్స‌వం సంచ‌ల‌న విజ‌యం సాధిస్తుంద‌ని భావించారంతా.

శ్రీమంతుడు త‌ర్వాత మ‌హేష్ నుంచి వ‌చ్చిన మూవీ ఇది. టాలీవుడ్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన శ్రీమంతుడుతో సూప‌ర్ స్టార్ ఇమేజ్ మ‌రింత పెరిగింది. ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌ట‌యిన‌ర్‌గా తెర‌కెక్కింది. కాజల్, స‌మంత‌, ప్ర‌ణీత వంటి ముగ్గురు అందాల భామ‌ల‌తో స్క్రీన్ కూడా వెలిగిపోయింది. కానీ, సినిమా డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా కేవ‌లం 40 కోట్ల‌కే ప‌రిమితం అయింది. ఆగడు కంటే దారుణ‌మైన ఫ్లాప్‌ను మూట‌గ‌ట్టుకుంది. ఇలా, 2016లో నిరాశ ప‌రిచాడు మహేష్‌. టాలీవుడ్‌లో 40 కోట్లు, మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌కు ఆద్యుడైన పోకిరి దూకుడు ఇలా డౌన్ కావ‌డం విశేషం. అయితే, మురుగ‌దాస్ మూవీతో ఆయ‌న మ‌ళ్లీ రెయిజ్ అవ‌డం ఖాయం. అంతేకాదు, తిరుగులేని విజ‌యం కూడా సాధిస్తాడు.

Loading...

Leave a Reply

*