గ్రౌండ్ వర్క్ రెడీ చేస్తున్న బోయపాటి…

unnamed

మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నాడు. ఇంట్లో కూర్చొని సీరియస్ గా హోం వర్క్ చేసుకుంటున్నాడు. ఇతడు గ్రౌండ్ వర్క్ చేస్తోంది చిరంజీవి 151వ సినిమా కోసం అనుకుంటే పొరపాటే. ఇద్దరు వ్యక్తులపై ఎన్ కౌంటర్ చేసేందుకు బోయపాటి భారీ కసరత్తు చేస్తున్నాడట. తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శల్ని తిప్పికొట్టేందుకు బోయపాటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడట. ఇంతకీ బోయపాటి టార్గెట్ చేసింది ఎవరినో తెలుసా. ఒకరు పోసాని కృష్ణమురళి రెండో వ్యక్తి స్టార్ డైరక్టర్ కొరటాల శివ.

ఈమధ్య పోసాని, బోయపాటిపై తీవ్ర విమర్శలు చేశాడు. తనను నమ్మకం ద్రోహం చేశాడు అనే విధంగా మాట్లాడాడు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి వ్యక్తిత్వాన్ని కడిగిపారేశాడు. పోసాని మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసు కదా.. అబ్బో నిజమే అనిపించేలా మాట్లాడతాడు. మరోవైపు కొరటాల కూడా బోయపాటిపై విమర్శలు చేశాడు. బోయపాటి తీసిన సింహా కథ తనదే అంటున్నాడు కొరటాల. ఈ విషయంలో బోయపాటి తనను మోసం చేశాడని తీవ్ర విమర్శలు చేశాడు.

పోసాని, కొరటాల చేసిన విమర్శలపై తీవ్రస్థాయిలో స్పందించాలని ఫిక్స్ అయ్యాడట బోయపాటి. వాళ్ల విమర్శలపై ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న ఈ దర్శకుడు ఓ మంచి వేదిక కోసం ఎదురుచూస్తున్నాడట. ఆ వేదికను కూడా తాజాగా ఫిక్స్ చేశాడని తెలుస్తోంది. ప్రొద్దుటూరులో లెజెండ్ సినిమా త్వరలోనే వెయ్యి రోజులు పూర్తిచేసుకోబోతోంది. ఘనంగా నిర్వహించబోతున్న ఆ పండగలో… పోసాని, కొరటాలను ఏకిపడేయాలని బోయపాటి భావిస్తున్నాడట.

Loading...

Leave a Reply

*