పవన్-బోయపాటి సినిమా… ఇక లేనట్టే…

pawan

తాజా వార్తల ప్రకారం… పవన్ తో బోయపాటి సినిమా లేనట్టే. ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్ కాదని చాలామంది ఊహించారు. ఎఁదుకంటే బోయపాటి యాక్షన్ ఇమేజ్ పవన్ కు సూట్ కాదు. ఆ కత్తులు పట్టుకోవడాలు, నరకడాలు పవన్ కు సెట్ కావు. కాబట్టి, కచ్చితంగా పవన్, బోయపాటిని రిజెక్ట్ చేస్తాడని అంతా అనుకున్నారు. అదేఇప్పుడు జరిగింది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది, అదే అందర్నీ షాక్ కు గురిచేస్తోంది. బోయపాటిని పవన్ రిజెక్ట్ చేయలేదట. పవన్ ఒప్పుకున్నప్పటికీ, బోయపాటే పవన్ ప్రాజెక్టు ను తిరస్కరించాడనే టాక్ నడుస్తోంది. ఇదే ఇప్పుడు షాకింగ్ న్యూస్ అయింది.

పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే చాన్స్ వస్తే ఏ దర్శకుడు కూడా ఆ చాన్స్ ని వదులుకోడు. కానీ బోయపాటి శ్రీను మాత్రం ఆ చాన్స్ ని వదులుకున్నాడట. ఇప్పుడు ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది . పవన్ కళ్యాణ్ హీరోగా బోస్ అనే చిత్రాన్ని నిర్మించడానికి దర్శకరత్న దాసరి నారాయణరావు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . అయితే బోయపాటి శ్రీను ని పిలిచి పవన్ తో చేయబోయే కథ గురించి చెప్పాడట దాసరి. కానీ ఆ కథ చేయనని నా దగ్గర వేరే కథ ఉందని చెప్పాడాట బోయపాటి.

దానికి దాసరి ఒప్పుకోక పోవడంతో బోయపాటి కూడా నో చెప్పేశాడట. దాంతో మరో దర్శకుడి వేటలో పడ్డారు.వేరే నిర్మాతలు, హీరోలు చెప్పిన కథలతో సినిమాలు చేయడం బోయపాటికి అలవాటు లేదు. ఇష్టం లేదు కూడా. ఇప్పటివరకు తన కథలతోనే సినిమాలు చేశాడు. పవన్ కోసం కూడా ఓ మంచి కథ రాసుకున్నానని, ఆ కథతోనే సినిమా చేస్తాను తప్ప, ఇతర కథలతో పవన్ ను డైరక్ట్ చేయనని బోయపాటి తేల్చిచెప్పినట్టు సమాచారం.

Loading...

Leave a Reply

*