బాలీవుడ్ జ్యోతిలక్ష్మిగా కంగనా రనౌత్…?

kangana

జ్యోతిలక్ష్మి సినిమా గుర్తుందా… పూరి జగన్నాధ్-చార్మి కలిసి నటించిన ఈ సినిమాను మగాళ్లు బాగానే చూశారు. కాస్త సోషల్ మెసేజ్ ఉన్నప్పటికీ… పూరి మాత్రం తన స్టయిల్ ఆఫ్ మేకింగ్ తో సినిమాకు కమర్షియల్ టచ్ ఇచ్చాడు. అటు చార్మి కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా నటించేసింది. అలాంటి సినిమా ఇప్పుడు బాలీవుడ్ కు కూడా వెళ్లబోతోంది. కుదిరితే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని జగన్ భావిస్తున్నాడట.

తెలుగులో జ్యోతిలక్ష్మి చేసిన పాత్రను హిందీలో కంగనా రనౌత్ తో చేయించాలని పూరి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కంగనాతో చర్చలు కూడా జరిపాడట. ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ ను కూడా వంద కోట్ల క్లబ్ లోకి చేర్చేంత స్టామినా కంగనాకు ఉంది. పైగా పూరీ జగన్, కంగనకు మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది. ఏక్ నిరంజన్ సినిమాతో కంగనాను తెలుగుతెరకు పరిచయం చేసింది పూరీ జగన్నాధే. సో.. ఇప్పుడు అదే పరిచయంతో జ్యోతిలక్ష్మి పాత్ర చేయమని అడిగాడట.

మరోవైపు కంగనా కూడా సౌత్ లో మరోసారి మెరవాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పూరి చెప్పిన జ్యోతిలక్ష్మి పాత్రకు ఆమె ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. ఎఁదుకంటే.. బాలీవుడ్ లో ఫిమేల్ ఓరియంటెడ్ పాత్రలు చేసే కంగన… సౌత్ లో మాత్రం 3 ముద్దులు, 4 పాటల హీరోయిన్ గా మాత్రమే కనిపించాలనుకుంటోందట. కేవలం గ్లామర్ తారగా మాత్రమే మెరవాలనుకుంటోందట.

Loading...

Leave a Reply

*