ప్లాన్ మార్చిన బన్నీ

untitled-11

బన్నీ ప్లాన్ మార్చాడు. కోలీవుడ్ లో అడుగుపెట్టాలనే నిర్ణయం తీసుకున్న అల్లువారబ్బాయ్.. ఆ దిశగా ఇప్పటికే ఓ అడుగువేశాడు. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో స్ట్రయిట్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడు.ఆ సినిమాను అఫీషియల్ గా కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గాడట బన్నీ. కుదిరితే లింగుస్వామి ప్రాజెక్టు కంటే ముందే తమిళనాట మరో మూవీతో ఎంటర్ అవ్వాలని స్కెచ్ రెడీ చేస్తున్నాడట.

ప్రస్తుతం డీజే సినిమా సెట్స్ లో ఉన్న బన్నీ… విక్రమ్ కుమార్ తో తాజాగా మరోసారి సిట్టింగ్ వేశాడు. ఈమధ్యే పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం కొన్నిరోజులు గ్యాప్ కూడా తీసుకున్న విక్రమ్ కమార్.. ఇప్పుడు మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగా… ఎప్పట్నుంచో నానుతున్న బన్నీ ప్రాజెక్టును ఫైనల్ చేశాడట. డీజే సెట్స్ లో బన్నీకి కథ వినిపించాడట. ఆ కథ బన్నీకి ఎఁత నచ్చిందంటే.. ఇప్పటికే ప్రకటించిన లింగుస్వామి సినిమాను కూడా పక్కనపెట్టేయాలనేంతగా తెగ నచ్చిందట.

అందుకే లింగుస్వామి సినిమాను హోల్డ్ లో పెట్టి… డీజే తర్వాత విక్రమ్ కుమార్ తోనే తెలుగు-తమిళ భాషల్లో సినిమా చేయాలని బన్నీ నిర్ణయించుకున్నట్టు టాక్. విక్రమ్ డైరక్షన్ లోనే తమిళనాట నేరుగా సినిమా చేయాలని బన్నీ అనుకోవడం వెనక మరో రీజన్ కూడా ఉంది. విక్రమ్ కుమార్ కు కోలీవుడ్ లో కూడా ఫాలోయింగ్ ఉంది. పైగా… అన్ని ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా యూనివర్సల్ సబ్జెక్ట్ చెప్పాడట. అందుకే బన్నీ ఇప్పుడు ప్లాన్ మార్చాడంటున్నారు.

Loading...

Leave a Reply

*