బాహుబ‌లి నిర్మాత‌ల‌కు వెంక‌య్య ఏం చెప్పారు!

baahubali

నోట్ల నిషేధం నేప‌థ్యంలో ఐటీ అధికారులు జోరు షురూ చేశారు. పెద్దొళ్లంద‌రిని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌ల‌పన్ని మ‌రీ బాహుబ‌లి నిర్మాత‌ల‌పై ద‌డులు చేశారు. ఎవ‌రో అగ‌ర్వాల్ అనే వ్య‌క్తిని టార్గెట్ చేసి స్కెచ్ వేస్తే… ఆ వ‌ల‌లో బ‌హుబ‌లి నిర్మాతలు ప‌డ్డారు. తాము అనుకున్న కొంద‌రు వ్య‌క్తుల‌కు ఫోన్లు చేసి న‌ల్ల‌ధ‌నం మారుస్తామ‌ని ముగ్గులోకి లాగి…. వారి నుంచి స‌మాచారం సేక‌రించి దాడులు చేసే ప‌నిని ఐటీ అధికారులు చేప‌ట్టారు. ఆ క్ర‌మంలోనే ముంబైకి చెందిన అగ‌ర్వాల్ ఐటీ అధికారుల వ‌ల‌కు చిక్కారు. అత‌డిని మాటల్లో పెడితే బాహుబ‌లి నిర్మాత‌ల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఆ సినిమా నిర్మాత‌లైన శోభు యార్ల‌గ‌డ్డ‌, దేవినేని ప్ర‌సాద్‌ల కార్యాల‌యాలు స‌హా వారికి చెందిన ముంబై, బెంగ‌ళూరు, హైద‌రాబాదుల్లోని ఇత‌ర చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు.

ఆ సోదాల్లో రూ.68 కోట్ల వ‌ర‌కూ న‌గ‌దు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ఆ నగ‌దును స్వాధీనం చేసుకున్న అధికారులు వాటికి సంబంధించిన లెక్కలు చూపించి తీసుకెళ్లాల‌ని నిర్మాత‌ల‌కు తెలిపారు. ఈ దాడులు టాలీవుడ్‌లో క‌లక‌లం రేపాయి. బాహుబ‌లి వంటి పెద్ద సినిమా విష‌యంలోనే ఇలా జ‌రిగితే ఇక చిన్న సినిమాల సంగ‌తేమిట‌ని నిర్మాత‌లు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే స్పందించిన కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు సూచ‌న‌ల‌తో కూడిన హెచ్చ‌రిక‌లు చేశారు. ఫిల్మ్‌న‌గ‌ర్ క్ల‌బ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వెంక‌య్య మాట్లాడుతూ… “మీరు సినిమా సూపర్ హిట్ అయిందంటూ 100 కోట్లు.. 200 కోట్లు.. 300 కోట్లు వసూళ్లు వచ్చాయంటారు. మహాబలి అంటూ ఉంటారు. ఇప్పుడు ఇన్ కం ట్యాక్స్ అధికారులు కో బలి అని చెప్పి రికార్డులు చూపించమన్నారు. మీరు నిజంగా పన్నులన్నీ కట్టేసి ఉంటే ఇందులో భయపడాల్సిన పనేమీ ఉండదు. లేకపోతే ప్రభుత్వం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది” అని వెంక‌య్య సుతారంగా హెచ్చ‌రిక‌లు చేశారు. ఇప్పుడీ హెచ్చ‌రిక‌లు తెలుగు ఇండ‌స్ట్రీని కుదిపేస్తున్నాయి.

Loading...

Leave a Reply

*