దిమ్మతిరిగే పైరసీకి మూడేళ్లు…

pawan1

ఆ చేదు జ్ఞాపకాన్ని ఎవరూ మరిచిపోలేరు. అప్పటి పీడకల ఇప్పటికీ కొందర్ని వెంటాడుతూనే ఉంటుంది. అవును.. తెలుగు చిత్ర సీమలోనే కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన పైరసీ జరిగి మూడేళ్లు గడిచిపోయాయి. అత్తారింటికి దారేది సినిమా అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ సినిమా ఆల్ టైం హిట్స్ లో ఒకటిగా నిలిచిందనేది ఎంత వాస్తవమో… అదే రేంజ్ లో పైరసీకి గురైందనేది కూడా అంతే వాస్తవం.అప్పటివరకు పైరసీ అంటే కేవలం కెమెరా ప్రింట్ మాత్రమే. అది కూడా సినిమా విడుదలైన తర్వాత నెట్ లోకి వచ్చేది. కానీ అత్తారింటికి దారేది సినిమా పైరసీ మాత్రం ఊహించనిది. మరో సినిమాకు జరగకూడనిది. విడుదలకు ముందే ఈ సినిమాకు సంబంధించి డీవీడీ క్వాలిటీ ప్రింట్ ను ఎవరో లీక్ చేశారు.

ఆడియో డాల్బీ క్వాలిటీ, వీడియో హెడ్ డీ క్వాలిటీ. ఇంక థియేటర్లకు వెళ్లాల్సిన పనేముంది. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం పైరసీలో సినిమా చూడలేదు. థియేటర్లకు వెళ్లి మరీ అత్తారింటికి దారేది సినిమా చూశారు. అలా పవన్ సినిమా అల్ టైం హిట్ గా నిలిచింది.పైరసీ కారణంగా… జీరో పబ్లిసిటీతో విడుదలైంది అత్తారింటికి దారేది సినిమా. పైరసీ జరిగిందని తెలిసిన వెంటనే… ఆఘమేఘాల మీద ఎలాంటి ప్రచారం లేకుండా సినిమాను విడుదల చేశారు. నిజంగా పైరసీ జరగకుండా ఉండుంటే.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించి ఉండేదని… ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ తెగబాధపడుతుంటారు. ఇప్పటికీ పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇదే.

Loading...

Leave a Reply

*