శతమానం భవతి సినిమాకు శతకోటి ఆలోచనలు…

untitled-8

దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా తెరకెక్కుతోందంటే… దాని ప్రమోషన్ గురించి హీరోహీరోయిన్లతో పాటు దర్శకుడు కూడా పెద్దగా చించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే.. తన సినిమాలకు ఎలా ప్రచారం కల్పించాలో, ఎలా జనాల్ని ఎట్రాక్ట్ చేయాలో, ఎలా మేన్ పవర్ ను పిండుకోవాలో రాజుగారికి తెలిసినట్టు ఎవరికీ తెలీదు. ఈ విషయంలో ఇప్పటికే కొత్తకొత్త ప్రచార ప్రయోగాల్ని మనకు చూపించిన రాజుగారు.. ఇప్పుడు మరో వినూత్న ప్రచారం ఎత్తుకోబోతున్నాడు. అది కూడా శతమానం భవతి సినిమాకు.

ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు దిల్ రాజు. అందుకే బాలయ్య, చిరంజీవి లాంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ తన చిన్న సినిమాను సంక్రాంతి బరిలో నిలిపాడు. ఇప్పుడీ సినిమాను మరింత మంది జనాలకు దగ్గరచేసేందుకు వినూత్నమైన ఎత్తుగడ వేశాడు. త్వరలోనే జరగనున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు ఏకంగా 25 మంది హీరోల్ని రప్పించాలని ప్లాన్ చేస్తున్నాడట. అంటే ఆడియో పంక్షన్ లో అసలు హీరో శర్వానంద్ ఎక్కుడున్నాడో వెదుక్కోవాలన్నమాట.

అయితే దిల్ రాజు పిలవగానే వచ్చే ఆ పాతిక మంది హీరోలు ఎవరా అనేది ఇప్పుడు అందరి డౌట్. పైగా ఒకేరోజు పాతికమంది హీరోలు ఖాళీగా ఉండాలి. బిజీగా ఉంటే కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసుకోవాలి. ఆ సంగతి పక్కనపెడితే.. ఆ పాతిక మందిలో కాస్తోకూస్తో పేరున్న హీరో ఒక్కడైనా ఉంటాడా అనేది డౌట్. దిల్ రాజు ఫంక్షన్ కాబట్టి.. వరుణ్ సందేశ్, సాయిధరమ్ తేజ లాంటి హీరోలు కంపల్సరీ ఉంటారు. ఇక మిగతా వాళ్ల లిస్ట్ కూడా త్వరలోనే తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*