మెగా హీరోకి దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చిన బిచ్చ‌గాడు..!

mega-hero

బిచ్చ‌గాడు.. ఈ ఏడాది టాలీవుడ్ రియ‌ల్ హిట్స్‌లో ఒక‌టి.. సూప‌ర్ డూప‌ర్ హిట్ కూడా. బిగ్ స్క్రీన్‌పై ఈ సినిమా సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. తాజాగా స్మాల్ స్క్రీన్‌పైనా బిచ్చ‌గాడు అంతే వండ‌ర్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమా లాస్ట్ వీక్ ఓ చానెల్‌లో ప్ర‌సార‌మ‌యింది. అంతే, ప్రేక్ష‌కులు ఎగ‌బ‌డి చూశారు బిచ్చ‌గాడిని. ఏకంగా 18.79 టీఆర్పీ పాయింట్‌లు పొందింది. ఈ రేంజ్‌లో టీఆర్పీ టాలీవుడ్ బ‌డా హీరోల చిత్రాల‌కు మాధ్య‌మే సాధ్యం. అదీ మొద‌టి రెండు సార్ల‌లో సినిమా టెలికాస్ట్ అయితేనే. కానీ, బిచ్చ‌గాడు ఊహించ‌ని స్థాయిలో టెలివిజ‌న్ రేటింగ్ పాయింట్స్ ద‌క్కించుకున్నాడు.

ఇక‌, బిచ్చ‌గాడుకి పోటీగా మ‌రో టీవీ చానెల్‌లో యువ మెగా హీరో సుప్రీం టెలికాస్ట్ అయింది. కానీ, ఈసినిమా కేవ‌లం 15 టీఆర్పీ పాయింట్‌లే పొందింద‌ట‌. సాయిధ‌ర‌మ్ తేజ్ వంటి రెయిజింగ్ హీరోకి ఇది కాస్త బెట‌ర‌నే చెప్పాలి. ప‌టాస్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, యువ మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సుప్రీమ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యాన్నే ద‌క్కించుకుంది. కానీ, బుల్లితెర‌పై బిచ్చ‌గాడుతో పోటీ ప‌డ‌లేక‌పోయింది.

కేవ‌లం 40 ల‌క్ష‌ల రూపాయ‌ల డ‌బ్బింగ్ రైట్స్ వెచ్చించి, మార్కెటింగ్ కోసం మ‌రో కోటిన్న‌ర రూపాయ‌లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసిన ఈ మూవీ.. ఏకంగా 25 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ట్ చేసింది. టాలీవుడ్ రెయిజింగ్ హీరోలకు కూడా ఇది బిగ్ టాస్క్‌. జ‌ర్నీ, షాపింగ్ మాల్‌, రంగం, ప్రేమిస్తే వంటి చిత్రాల త‌ర్వాత ఓ కోలీవుడ్ చిన్న మూవీ ఈ రేంజ్ స‌క్సెస్‌ని పొందింది. విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించిన ఈ చిత్రం ఎన్నో రికార్డులు బ‌ద్దలు కొట్టింది. అంతేకాదు, ఆయ‌న‌కు మంచి మార్కెట్‌ని కూడా తెచ్చిపెట్టింది. ఇలా, బిచ్చ‌గాడు సుప్రీమ్ హీరోకి మెగా షాక్ ఇచ్చాడ‌న్న‌మాట‌.

Loading...

Leave a Reply

*