కొర‌టాల‌కు బాల‌య్య వార్నింగ్‌…!

balayya

మొన్న మిర్చి, నిన్న శ్రీమంతుడు, నేడు.. జ‌న‌తా గ్యారేజ్‌.. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌తో దూసుకుపోతున్నాడు కొర‌టాల శివ‌. ఇప్పుడు టాలీవుడ్‌లో ఆయ‌నదే హ‌వా. రాజ‌మౌళి త‌ర్వాత టాలీవుడ్‌లో హ్యూజ్ హిట్స్ డెలివ‌ర్ చేస్తున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల‌నే. జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత మ‌హేష్‌తో మ‌రో మూవీకి రెడీ అవుతున్నాడు కొర‌టాల‌. ఈ సినిమా రాజ‌కీయాల బ్యాక్ డ్రాప్‌లో న‌డుస్తుంద‌నే మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరో సీఎం అవుతాడనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక‌, బాల‌య్య‌-కృష్ణ‌వంశీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న మూవీలోనూ ఇలాంటి రూమరే షికారు చేస్తోంది. ఈ సినిమాలో బాల‌య్య రైతు పాత్ర‌తోపాటు సీఎంగా కూడా న‌టించ‌నున్నాడ‌ట‌. ఇక‌, క‌థ‌కు కీల‌క‌మైన రాష్ట్ర‌ప‌తి పాత్ర‌లో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌ను సంప్ర‌దించార‌ట‌. ఈ పాత్ర‌కు ఆయ‌న ఓకే చెప్పాడ‌ని, సంక్రాంతి త‌ర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వ‌స్తుంద‌నే మాట వినిపిస్తోంది.అటు కొర‌టాల శివ‌- ఇటుకృష్ణ‌వంశీ చిత్రాల క‌థ‌ల‌లో చిన్న సారూప్యాలున్నాయ‌ని, దీంతో, ఎవ‌రో ఒక‌రు జాగ్ర‌త్త ప‌డ‌క త‌ప్ప‌ద‌ని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.

సో.. ఈ రెండు సినిమాల‌లో బాల‌య్య‌-కృష్ణ‌వంశీ రైతు క‌థే సెట్స్‌పైకి రానుంది. ప్ర‌స్తుతం మ‌హేష్‌.. మురుగ‌దాస్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇది వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ కానుంది. అంత‌కుముందే బాల‌య్య‌-కృష్ణ‌వంశీ మూవీ షూటింగ్ దాదాపు స‌గం పూర్త‌వుతుంది.. అంటే, క‌థ ఒకేలా ఉంటే క‌నుక‌, కొర‌టాల శివ జాగ్ర‌త్త ప‌డ‌క త‌ప్ప‌దు. ఒక‌ర‌కంగా ఇప్ప‌టికే ఆయ‌న‌కు బాల‌య్య‌-కృష్ణ‌వంశీ వార్నింగ్ లాంటిది హింట్ ఇచ్చిన‌ట్లే అంటున్నారు సినీ జ‌నాలు. మ‌రి, క‌థ ప‌రంగా ఒకేలా ఉంటే కేర్ తీసుకోక‌త‌ప్ప‌ద‌న్న‌మాట‌.

Loading...

Leave a Reply

*