గౌత‌మీపుత్ర‌కి బాల‌య్య ఎంత తీసుకున్నాడు..?

nbk

ప్ర‌స్తుతం రెమ్యూన‌రేష‌న్ ప‌రంగా టాలీవుడ్‌లో ముందున్నారు ప‌వ‌న్‌, మహేష్‌. ప‌వ‌న్ రీసెంట్‌గా ఆయ‌న సొంత సినిమాలు చేసుకుంటున్నాడు. ఆయ‌న త‌న ఫ్రెండ్ శ‌ర‌ద్ మ‌రార్‌తో క‌లిసి నిర్మిస్తున్నాడు. సో.. పారితోషికం ఎంత‌నేది వారికే తెలియాలి. ప్ర‌స్తుత మార్కెట్ ప్ర‌కారం అయితే ఆయ‌న‌కు 20 కోట్ల‌కుపైగా చెల్లించ‌డానికి రెడీ అంటున్నారు నిర్మాతలు. ఇక‌, మహేష్ బాబు విష‌యానికి వ‌స్తే.. మురుగ‌దాస్ మూవీకి 25 కోట్లు పుచ్చుకుంటున్నాడంటూ ప్ర‌చారం జరుగుతోంది. ఆ త‌ర్వాత లిస్ట్‌లో ఎన్టీఆర్ ఉన్నాడు. ఆయ‌న‌కు 15-18 కోట్ల రూపాయ‌లు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నారు నిర్మాత‌లు. టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల విజ‌యంతో తార‌క్‌కి డిమాండ్ పెరిగింది.

ఇక‌, బ‌న్ని, ప్ర‌భాస్ కూడా 15 కోట్ల రేంజ్‌లో ఉంటారు. చెర్రీకి రీసెంట్‌గా ఫ్లాప్‌లు రావడంతో క్రేజ్ కాస్త త‌గ్గింది. 12 కోట్లు ఇస్తున్నార‌ట నిర్మాత‌లు.
వీరిని ప‌క్క‌న‌పెడితే.. చిరంజీవి ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో భారీ పారితోషికం తీసుకునేవారు. అయితే, రీ ఎంట్రీలో ఆయ‌న మార్కెట్ ఎంతనేది ఇంకా తెలియ‌దు. ఎందుకంటే ఆయ‌న న‌టిస్తున్న ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రం ఆయ‌న సొంత బ్యాన‌ర్‌లో నిర్మిత‌మ‌వుతోంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో రామ్‌చ‌ర‌ణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఈ మూవీనిఅయితే, బాల‌య్య రెమ్యూన‌రేష‌న్ ఎంత అనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌స్తుతం నంద‌మూరి హీరో మార్కెట్ 50-60 కోట్ల మ‌ధ్య‌లో ఉంది. ఆయ‌న న‌టించిన లెజెండ్ దాదాపు 45 కోట్లు క‌లెక్ట్ చేసింది.

అయితే, ప్రెజెంట్ ఆయ‌న న‌టిస్తున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి మూవీ ఆయ‌న త‌ప్ప మరెవ‌రూ చెయ్య‌లేని ప్రాజెక్ట్‌. మ‌రెవ‌రికీ అది నప్ప‌దు. చారిత్ర‌క పాత్ర కావ‌డంతో బాల‌య్య ఆహార్యం, ఆంగికం, వాచ‌కం దానికి ప‌ర్‌ఫెక్ట్ సెట్ అవుతుంద‌ని భావించ‌డంతో ఆయ‌ననే ఎంచుకున్నారు క్రిష్‌. ఈ సినిమాకి బాల‌య్యకు ఏడు కోట్ల రూపాయ‌ల‌ పారితోషికం ఇస్తున్నార‌ట‌. ఈ సినిమా సీడెడ్ రైట్స్ రాసిస్తామ‌న్నా వ‌ద్ద‌న్నార‌ట‌. రాయ‌ల‌సీమ‌లో బాల‌య్యకు సూప‌ర్ ఫాలోయింగ్ ఉంది. దీంతో, పారితోషికం బ‌దులు అవి ఇస్తామ‌న్నా.. ఆ త‌ల‌నొప్పులు నాకొద్ద‌న్నార‌ట‌. అయితే, నాగ్, వెంకీ వంటి హీరోల‌కి అయిదు కోట్ల పారితోషికం ఇస్తున్నారు. మ‌రి, గౌత‌మీపుత్రతో ఆయ‌న రేంజ్ పెరుగుతుందా? లేదా అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*