బాల‌య్య‌, ప‌వ‌న్ క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ మూవీలో..!

balskrishna-and-pawan

రెండు మూడేళ్ల క్రితం తెలుగు సినిమాని మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు ఊపేశాయి. మ‌హేష్‌-వెంకీ, ప‌వ‌న్‌-వెంకీతోపాటు అక్కినేని మూడుత‌రాల హీరోలు క‌లిసి న‌టించారు. అదో పెద్ద మ‌ల్టీస్టార‌ర్‌. రీసెంట్‌గా ఆ సినిమాల జోరు త‌గ్గింది. అయితే, టాలీవుడ్‌లో మ‌రోసారి మ‌ల్టీస్టార‌ర్ మూవీ రెడీ అవ‌బోతోంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

ఏడాది క్రితం త‌మిళ్ జిల్లాని రీమేక్‌పై ప‌లు ఊహాగానాలు వినిపించాయి. ఓ ద‌శ‌లో క‌ల్యాణ్‌రామ్‌-బాబాయ్‌తో క‌లిసి న‌టించడానికి రెడీ అన్నాడు. అది జిల్లా రీమేక్ అని భావించారంతా. అంత‌కుముందు ఎన్టీఆర్‌-మోహ‌న్‌లాల్ క‌లిసి ఈ రీమేక్ చేస్తార‌నే రూమ‌ర్ వినిపించింది. ఇటు చెర్రీ-చిరు క‌లిసి ఇదే చిత్రాన్ని తెలుగులో చేస్తార‌నే టాక్ కూడా నడిచింది. కానీ, జిల్లా తెలుగులోకి మాత్రం రాలేదు. అయితే, ఈ చిత్రం మ‌రోసారి హాట్ టాపిక్‌గా మారింది. బాల‌య్య‌-ప‌వ‌న్ క‌లిసి దీనిలో న‌టిస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

త‌మిళ్ జిల్లాలో మోహ‌న్‌లాల్‌-విజ‌య్ క‌లిసి న‌టించారు. అది అక్క‌డ మంచి విజ‌యం సాధించింది. అమ‌లాపాల్ హీరోయిన్‌. ఇదే సినిమా క‌థ‌ని రీసెంట్‌గా ఓ నిర్మాత బాల‌య్య‌-ప‌వ‌న్ క‌లిసి చేస్తే బావుంటుంద‌ని భావించాడ‌ట‌. ఆ విష‌యాన్ని ఇద్ద‌రు ముగ్గురు ద‌ర్శ‌కుల‌తోనూ షేర్ చేసుకున్నాడ‌ట‌. దీనికి వారు కూడా మంచి ఆలోచ‌న అన‌డంతో ప్ర‌స్తుతం ఆ బ‌డా నిర్మాత ఇద్ద‌రి కాల్‌షీట్స్‌ని సంపాదించే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌నే రూమ‌ర్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ ఇద్ద‌రు హీరోలు.. ప్రెజెంట్ టీడీపీకి మ‌ద్ద‌తు ప‌లుకుతున్నారు. బాల‌య్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటే, జ‌న‌సేనానిగా ప‌వన్ టీడీపీకి స‌పోర్ట్ చేస్తున్నారు. ఇలా, రాజ‌కీయ రంగు కూడా పులుముకుంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. మ‌రి, ఇది ప‌ట్టాలెక్కుతుందా? లేదా? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*