జ‌గ‌న్ సాక్షిటీమ్ క‌థ‌తో బాల‌య్య సినిమా..!

balyya

జ‌గ‌న్‌.. బాల‌య్య‌.. రాజ‌కీయంగా వైరిప‌క్షాలు.. ఒక‌రు.. టీడీపీ.. మరొక‌రు.. వైఎస్సార్సీ. ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత వైరం లేదు కానీ. ఇద్ద‌రి మ‌ధ్య మంచి రిలేష‌న్స్ ఉన్నాయంటారు కొంద‌రు. జ‌గ‌న్ బాల‌య్య అభిమాని అని.. చాలా మంది చెబుతారు. ఇద్ద‌రూ మాజీ సీఎంల ముద్దుల పుత్రులే. ఇదంతా ప‌క్క‌న పెడితే.. ఇప్పుడూ ఒక‌రినొక‌రు రాజ‌కీయంగా ఢీ కొడుతున్నారు.రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెడితే.. జ‌గ‌న్ సన్నిహితుడు, సాక్షిలో ఫీచ‌ర్స్ ఎడిట‌ర్‌గా, కీలక స‌భ్యుడిగా ఉన్న రామ్‌రెడ్డి అందిస్తున్న క‌థ‌లో బాల‌య్య న‌టిస్తుండ‌డం విశేషం. ఇంత‌కీ అది ఏ సినిమా అంటారా..? బాల‌కృష్ణ 101వ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే అంతా అందిస్తున్న‌ది సాక్షి రామ్‌రెడ్డి. ఈ సినిమాకి కృష్ణ‌వంశీ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నాడు. బాల‌య్య వందో చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.. ప్ర‌స్తుతం సెట్స్‌పై ఉంది. ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కోతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌వ‌గానే.. 101వ చిత్రంపై ఫోక‌స్ పెడ‌తాడు.

అయితే, ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే.. ఇది రైతు బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోంది. రైతుల క‌థ అంటే రైతు స‌మ‌స్య‌లు, వారి క‌ష్టన‌ష్టాల‌పై సీన్స్ గ్యారంటీగా ఉంటాయి. అంటే, అది ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉంటుందా? లేక‌, రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా రైతు స‌మ‌స్య‌ల‌పైనే పోరాటం ఉంటుందా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రోవైపు, ఇటు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. అటు కేంద్రంలో వారు మ‌ద్ద‌తిస్తున్న ఎన్‌డీఏ ప్ర‌భుత్వంలో ఉంది. సో.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాలు ఉండ‌వు అనేది స్ప‌ష్టం. కానీ, ఈ క‌థ మాత్రం అదిరిపోయింద‌నే మాట వినిపిస్తోంది. వందో చిత్రం మొద‌ట ఈ క‌థే అనుకున్నా.. త‌ర్వాత క్రిష్ గౌత‌మీపుత్ర స్టోరీ న‌చ్చ‌డంతో ఆ స్టోరీని ప‌ట్టాలెక్కించాడు బాల‌య్య‌. బాల‌య్య‌-సాక్షి రామిరెడ్డి సినిమా ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Loading...

Leave a Reply

*