గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఫ‌స్ట్ లుక్ ఇదే..!

balayya

గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.. బాలయ్య వందో చిత్రం.. ఆయ‌న కెరీర్‌లోనే ఓ ప్ర‌తిష్టాత్మ‌క మూవీ. విల‌క్ష‌ణ చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్‌. ఇప్ప‌టికే షూటింగ్ నాడు ఓ లుక్‌ని హ‌డావిడిగా రిలీజ్ చేసిన చిత్ర బృందం ద‌స‌రా కానుక‌గా ఈ ఫ‌స్ట్ లుక్‌ని విడుదల చేశారు.శాత‌వాహ‌నుల రాజు గౌత‌మీపుత్ర శాత‌కర్ణి జీవిత గాథ ఆధారంగా తెర‌కెక్కుతోంది ఈ చిత్రం. హేమ‌మాలిని త‌ల్లిగా న‌టిస్తోంది. శ్రియా హీరోయిన్‌. ఇప్ప‌టికే దాదాపు టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వ‌ర‌లోనే పాట‌ల షూటింగ్ జ‌రుపుకోనుంది.

ఒక‌టీ రెండు కీల‌క స‌న్నివేశాలు మిన‌హా టాకీ పార్ట్ పూర్త‌యింద‌నేది సినిమా వ‌ర్గాల మాట‌. ద‌స‌రా సంద‌ర్భంగా టీజ‌ర్‌ని కూడా రిలీజ్ చెయ్య‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల‌యిన ఫ‌స్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. రాజ‌సం ఉట్టి ప‌డే క‌ళ‌తో బాల‌య్య అదుర్స్ అనిపిస్తున్నాడు. ఈ నెల 11న టీజ‌ర్ రానుంది. దీంతో, సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరుగుతాయ‌ని శాత‌క‌ర్ణి టీమ్ ధీమాగా ఉంది. ఇప్ప‌టికే లీక్ అయిన టైటిల్ సాంగ్‌కి సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. సో.. టీజ‌ర్ కోసం నంద‌మూరి అభిమానులు టీజ‌ర్ కోసం ఎదురు చూస్తున్నారన్న‌మాట‌.

Loading...

Leave a Reply

*