బాలయ్య చెప్పాలనుకున్నాడు… చిరంజీవి ఇప్పుడే చెప్పేస్తున్నాడు….

balayya

తన 101వ సినిమాగా కృష్ణవంశీతో ఓ భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేశాడు బాలకృష్ణ. గౌతమీపుత్ర శాతకర్ణి కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఈమేరకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసి, కృష్ణవంశీకి సమాచారం కూడా అందించాడు. అయితే కృష్ణవంశీ సినిమా ద్వారా బాలయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడో… అదే విషయాన్ని చిరంజీవి ముందే చెప్పేస్తున్నాడట.బాలయ్య 101వ సినిమాలోని కథను, చిరంజీవి తన 150వ సినిమాలోనే వినిపిస్తున్నాడనేది తాజా రూమర్. తన 101వ సినిమాలో రైతు సమస్యలు, వాళ్ల ఆత్మహత్యల్ని ప్రస్తావించాలనుకుంటున్నాడు బాలయ్య.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశానికి వ్యవసాయం ఎంత అవసరమో చెప్పబోతున్నాడట. యాజ్ ఇటీజ్ ఇదే అంశాన్ని చిరంజీవి తన 150వ సినిమాలో ఓ ఎపిసోడ్ లో చెప్పేస్తున్నాడట. దీంతో బాలయ్య సినిమాపై ఆసక్తి తగ్గే అవకాశం ఉందంటున్నారు.ఖైదీ నంబర్ 150 కోసం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శివార్లలో ఈ ఎపిసోడ్ ను పిక్చరైజ్ చేశారని తెలుస్తోంది. నాగలి పట్టడం, పొలం దున్నడం, రైతుల కోసం ఫైట్ చేయడం లాంటి సన్నివేశాలతో పాటు… బాలయ్య సినిమాలోని కొన్ని ముఖ్యమైన పాయింట్లను చిరంజీవి ఇప్పటికే కవర్ చేశాడని అంటున్నారు. సో… చిరు 150వ సినిమా విడుదలైన తర్వాత… బాలయ్య 101వ సినిమాలో మార్పులు జరుగుతాయేమో చూడాలి.

Loading...

Leave a Reply

*