హృతిక్ పరువు తీసిన బాలకృష్ణ…

untitled-10

బాలీవుడ్ లో హృతిక్ రోషన్ పేరుచెబితే చాలు కోట్లలో వ్యాపారం జరిగిపోతుంది. అతడి సినిమాలకు ఉన్న ఫాలోయింగే వేరు. మరీ ముఖ్యంగా సూపర్ మేన్ సిరీస్ తో హృతిక్ రోషన్ బాగా ఫేమస్ అయిపోయాడు. అతడి అందం, డాన్సింగ్ టాలెంట్ బాలీవుడ్ లో మరో హీరోకు లేవు. అలాంటి హీరోను బాలయ్య కంగుతినిపించాడు. హృతిక్ పరువంతా తీసి పడేశాడు. ఇక నువ్వు వేస్ట్ హృతిక్ అనే రేంజ్ లో నడిరోడ్డుపై నిలబెట్టేశాడు. అవును.. బుల్లితెరపై బాలయ్య ప్రభంజనం ముందు హృతిక్ క్రేజ్ వెలవెలబోయింది. టీఆర్పీ రేటింగ్ లు సాక్షిగా హృతిక్ పరువు పోయింది.

హృతిక్ లేటెస్ట్ మూవీ ‘మొహెంజొదారో’ను వరల్డ్ టీవీ ప్రీమియర్ గా వేస్తే వచ్చిన టీఆర్పీ కంటే… మన నటసింహం నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ సినిమాకు హిందీలో ఎక్కువ టీఆర్పీ వచ్చింది. ఈ నెల 9న మొహెంజొదారోను స్టార్ గోల్డ్ లో ప్రసారం చేస్తే రూరల్ ఏరియాస్ లో 1511 రేటింగ్ వచ్చిందని, అంతకుముందు రోజున బాలయ్య నటించిన ‘డిక్టేటర్’ హిందీ వెర్షన్ ‘యుద్ధ్ ఏక్ జంగ్’ ను సినీఫ్లెక్స్ ఛానెల్ లో ప్రసారం చేస్తే 1649 పాయింట్ల రేటింగ్ వచ్చిందని చెబుతున్నారు. దీంతో ఆగష్టులో రిలీజైన మొహెంజొదారో లాంటి ప్రతిష్టాత్మక చిత్రం ప్రీమియర్ టీవీ షో కంటే ఎక్కువగా బాలయ్య డబ్బింగ్ సినిమాకు రూరల్ లో రేటింగ్ రావడం హృతిక్ కు పెద్ద షాక్.

ఇదే చిత్రం అనుకుంటే.. రూరల్ టీఆర్పీ లిస్టు ప్రకారం ఈ కేటగిరీలో ఆ వారం టాప్-1 లో బాలయ్య సినిమాయే నిలవడం మరో కొసమెరుపు. అలాగే ఈ లిస్టులో హీరో గోపీచంద్ నటించిన జిల్ సినిమా డబ్బింగ్ వెర్షన్ కూడా నాలుగో స్థానంలో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తెలుగు యాక్షన్ డబ్బింగ్ సినిమాలకు హిందీ టీవీ ఛానెళ్లలో మంచి ఆదరణ ఉందని మరోసారి నిరూపించాయి ఈ సినిమాలు.

Loading...

Leave a Reply

*