బాలయ్య ఫిలింఫెస్టివల్… అతి త్వరలో…

gowtami

బాలయ్య ప్రస్తుతం వందో సినిమా చేస్తున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణిని గ్రాండ్ గా విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నాడు. అయితే బాలయ్య ఈ మొత్తం సినీ జర్నీని ఓ వేడుకలా జరపాలని బాలయ్య ఫ్యాన్స్ నిర్ణయించారు. వంద సినిమాలు పూర్తిచేసుకుంటున్న తన అభిమాన నాయకుడి రోజును.. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అని తెగ ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా ప్రొద్దుటూర్ ఫ్యాన్స్ కు ఓ వినూత్నమైన ఆలోచన వచ్చింది.

బాలయ్య వందో సినిమా విడుదలకు దగ్గరపడుతున్న సందర్భంగా… ఇప్పటివరకు బాలయ్య నటించిన 99 సినిమాల్ని ఒకేసారి ప్రదర్శిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఫ్యాన్స్ కు వచ్చింది. అంతే ఆలోచన రావడమే ఆలస్యం.. పొద్దుటూరు లో బాలయ్య కోసమే కేటాయించిన అర్చన ధియేటర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఆ థియేటర్లో లెజెండ్ ఆడుతోంది. దిగ్విజయంలో 920 రోజులు పూర్తిచేసుకుంది.

ఈ థియేటర్లో ఇకపై రోజుకో షో… చొప్పున బాలయ్య నటించిన 99 సినిమాల్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. అది కూడా కేవలం 99 రూపాయలకే 99 సినిమాలు చూపించాలని నిర్ణయించుకున్నారు. ఒక్కసారి 99 రూపాయలు పెట్టి టిక్కెట్ కొనుక్కుంటే.. ఈ థియేటర్ లో బాలయ్ నటించిన 99 సినిమాల్ని రోజుకు ఒకటి చొప్పున చూడొచ్చు.

Loading...

Leave a Reply

*