ఈసారి బాహుబలిని కొట్టడం ఎవడితరం కాదు…

bahubhali-p

బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6వందల కోట్ల రూపాయలు సంపాదించింది. ఆ రికార్డు ఇప్పట్లో తుడిచిపెట్టుకుపోయేది కాదు. ఆ వసూళ్లు సాధించడం ఇప్పట్లో సాధ్యం కాదు. అందుకే బాహుబలిని వదిలేసి, నంబర్-2 స్థానం కోసం పోటీపడుతున్నారు మన స్టార్ హీరోలు. పైకి ఒప్పుకోకపోయినా.. ఇది పచ్చినిజం. అయితే భవిష్యత్తులో మాత్రం బాహాటంగానే ఈ విషయాన్ని ఒప్పుకుంటారు మిగతా హీరోలు. ఎఁదుకంటే.. బాహుబలి-2 వస్తోంది.. అంతకుమించిన వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

బాహుబలి-2 ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందనే విషయాన్ని పక్కనపెడితే.. అసలు ఈ సినిమా క్రియేట్ చేస్తున్న ప్రీ-రిలీజ్ బిజినెస్ ను కూడా అందుకోవడం మిగతా హీరోలకు యమ కష్టం. ఆ రేంజ్ లో బాహుబలి-2 బిజినెస్ జరుగుతోంది. తాజాగా నైజాంలో ఈ సినిమా 45 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందని టాక్. ఇప్పటివరకు బడా హీరోల సినిమాలేవీ నైజాంలో 45కోట్ల రూపాయలకు అమ్ముడుపోలేదు. భవిష్యత్తులో అమ్ముడుపోతుందనే గ్యారెంటీ కూడా లేదు.

ఎందుకంటే… ఏ హీరోకు ఆ స్థాయిలో కలెక్షన్లు వస్తాయనే నమ్మకం లేదు. ఎవరికీ అందరి అలాంటి అరుదైన రికార్డును బాహుబలి-2 సృష్టించింది.ఏషియన్ సినిమాస్ కు చెందిన సునీల్.. ఈ సినిమా నైజాం రైట్స్ ను దక్కించుకున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి నిర్మాతలు కలిసి ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకోవాలని చూశారు. కానీ వాళ్లు కోట్ చేసిన ఎమౌంట్ కంటే 30శాతం ఎక్కువ ధరకు బాహుబలి-2 అమ్ముడుపోయింది.

Loading...

Leave a Reply

*