బాహుబలి కంటే ముందే మహేష్ సినిమా

mahi

గతంలో జరిగిన ఎపిసోడ్ గుర్తుందా.. బాహుబలి సినిమా విడుదలైన వారం గ్యాప్ లో శ్రీమంతుడు వచ్చింది. అదృష్టవశాత్తూ బాహుబలితో పాటు శ్రీమంతుడు కూడా హిట్ అయింది. నిజంగా అప్పుడే శ్రీమంతుడు ఫ్లాప్ అయి ఉంటే… బాహుబలి దెబ్బకు మహేష్ బలి అని చాలా ఆర్టికల్స్ వచ్చేసి ఉండేవి. ఆ భయం మహేష్ లో కూడా ఉంది. తాజాగా బ్రహ్మోత్సవంతో మాంఛి డిజాస్టర్ అందుకున్న మహేష్ బాబు… ఈసారి మాత్రం అలాంటి మిస్టేక్ రిపీట్ చేయదలుచుకోలేదు.

అందుకే బాహుబలి-2తో పోటీ నుంచి ప్రిన్స్ తప్పుకున్నట్టు తెలుస్తోంది.మొన్నటివరకు బాహుబలి-2తో పాటు మహేష్ సినిమా కూడా వస్తుందని కొందరన్నారు. మరికొందరు మాత్రం గతంలో జరిగిన ఎపిసోడ్ ప్రకారం… బాహుబలి-2 వచ్చిన వారం గ్యాప్ లోనే మహేష్ మూవీ వస్తుందని ఫిక్స్ అయ్యారు. కానీ తాజా సమాచారం ప్రకారం… బాహుబలి-2 కంటే ముందే మహేష్ – మురుగదాస్ సినిమా వస్తోంది.

అది కూడా 2 వారాల ముందు విడుదలకానుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే… ఏప్రిల్ 14న మహేష్ మూవీ సందడి చేయడం ఖాయం.సినిమా ఫస్ట్ లుక్ ను దీపావళి కానుకగా మరోవారం రోజుల్లో విడుదల చేయబోతున్నారు. కుదిరితే అదే రోజు ఈ విడుదల తేదీని ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఖమ్మం, కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

Loading...

Leave a Reply

*