ఒక్క అమెరికా హ‌క్కులు 45 కోట్లు.. బాహుబ‌లి సంచ‌ల‌నం..!

bahubali-2-us-canda-rights-sets-new-record

బాహుబ‌లి 2 సంచ‌ల‌నాలు షురూ అవుతున్నాయి. అక్టోబ‌ర్ 5న రాజ‌మౌళి ఓ తీపిక‌బురు చెబుతాన‌ని చెప్పాడు బాహుబ‌లి 2 గురించి. కానీ, అంత‌కంటే ముందే వ‌ర‌స‌గా వండ‌ర్స్ న‌మోద‌వుతున్నాయి. బాహుబ‌లి 2పై మార్కెట్‌లో ఎంత క్రేజ్ ఉందో ఈ ఒక్క ఫిగ‌ర్ చాలు చెప్ప‌డానికి. ఒక్క అమెరికా, కెన‌డా హ‌క్కుల‌నే ఏకంగా 45 కోట్ల‌కు కొనుగోలు చేసింది గ్రేట్ ఇండియ‌న్ ఫిల్మ్స్ సంస్థ‌. తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళీ, హిందీ అన్ని భాష‌ల హ‌క్కులు క‌లిపి ఈ రేంజ్‌లో ప‌లికాయి. ఇండియాలోనే ఇదో పెద్ద రికార్డ్‌. ఏ భార‌తీయ సినిమాకి కూడా ఈ రేంజ్‌లో డిమాండ్ ప‌ల‌క‌లేదు. ఇలా, బాహుబ‌లి 2 హంగామా మొద‌ల‌యింది.

బాహుబ‌లి 2టోట‌ల్‌గా 400 కోట్ల బిజినెస్ చేస్తుంద‌నే అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. యూఎస్‌, కెనడా మిన‌హా ఇత‌ర ఓవ‌ర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా మ‌రో 30-40 కోట్ల‌కు అమ్ముడుపోతుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇటు, తెలుగు రైట్స్ మాత్ర‌మే.. 100 కోట్ల‌కు పైగా మార్కెట్ అవుతుంద‌ని భావిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ ఈ చిత్రం 100 కోట్ల‌కు కొనుగోలు చేసేందుకు క‌రణ్ జోహార్ అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నాడనే ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు, త‌మిళ్‌, మ‌ల‌యాళీతోపాటు క‌ర్నాటక ఏరియాస్‌లో బాహుబ‌లి 2 మ‌రో 70-80 కోట్లు బిజినెస్ చేస్తుంద‌నే అంచ‌నాలున్నాయి. ఇవి కాక శాటిలైట్ రైట్స్ ఉన్నాయి. ఇక‌, కామిక్, వీడియో గేమ్స్ మార్కెట్ కూడా ఉంది. దీంతో, 400 కోట్ల వ్యాపారం జ‌ర‌గ‌నుంద‌ట బాహుబ‌లి 2.

మ‌ళ్లీ బాహుబలి 2 న్యూస్ షురూ అయింది. నిన్న‌టికి నిన్న ప్ర‌భాస్ మైన‌పు బొమ్మ మేడ‌మ్ టుస్సాడ్ మ్యూజియంలో కొలువుదీర‌నుంద‌నే వార్త‌తో తెలుగు మీడియా హోరెత్తింది. మ‌హాత్మాగాంధీ, న‌రేంద్ర మోదీ త‌ర్వాత మూడో వ్య‌క్తి ప్ర‌భాసే. ఇలా, బాహుబ‌లి 2 రికార్డ్‌ల ప‌రంప‌ర ఈ సారి విడుద‌ల‌కు 6 నెల‌ల ముందునుంచే మొదల‌యింద‌న్న‌మాట‌.

 

Loading...

Leave a Reply

*