బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్‌ వ‌చ్చేసింది.. అదుర్స్‌….!

untitled-16-1

bahubali-2-first-look

ఏడాదిన్న‌ర‌ నిరీక్ష‌ణ‌కు బ్రేక్ ప‌డింది. బాహుబ‌లి 2 టీజ‌ర్ వ‌చ్చేసింది. బాహుబ‌లిలాగానే పార్ట్ 2 టీజ‌ర్ కూడా అదిరిపోయింది. ప్ర‌భాస్‌కి అదిరిపోయే బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు జ‌క్క‌న్న‌. ప్ర‌భాస్ లుక్ అదిరిపోయింది. ఫ‌స్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌లోనే ఆయ‌న హ్యాండ్సమ్‌గా క‌నిపిస్తున్నాడు.టీజ‌ర్ చూసిన త‌ర్వాత ఈ మూవీపై అంచ‌నాలు రెట్టింప‌య్యాయి. రాజ‌మౌళి టేకింగ్ ఏంటో మ‌రోసారి ప్రూవ్ అయింది. ఇండియాలోని టాప్ మోస్ట్ డైరెక్ట‌ర్‌లలో ఒక‌డిగా జ‌క్క‌న్న నిల‌బడ్డాడంటే ఆయ‌న తీసుకున్న కేర్ ఏంటో అర్ద‌మ‌వుతుంది. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్రమైజ్‌కాని ఈ శైలే రాజ‌మౌళిని టాప్ మోస్ట్ డైరెక్ట‌ర్‌గా నిల‌బెట్టింది.సెకండ్ పార్ట్‌లో క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అనే ఎలిమెంట్ కీల‌కంగా మార‌నుంది.

ఇక‌, అనుష్క మొద‌టి భాగంలో ముదుస‌లిగా క‌నిపించింది. రెండో పార్ట్‌లో ఆమె దేవ‌సేన రోల్ సినిమాకి హైలైట్‌గా నిల‌వ‌నుంద‌ట‌. దీంతో, బాహుబ‌లి పార్ట్ 2పై అంచ‌నాలు మ‌రింత పెరుగుతున్నాయి.బాహుబ‌లి ది బిగినెంగ్ కంటే ది క‌న్‌క్లూజ‌న్‌పైనే అంచ‌నాలు మ‌రింత‌గా ఉన్నాయి. ఈ సినిమాపై దాదాపు 4 వంద‌ల కోట్ల బెట్టింగ్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే, ఒక్క అమెరికా ఓవ‌ర్సీస్ రైట్స్ 50కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇటు, నైజాం ఏరియా రైట్స్ కూడా దాదాపు ఇంతే రేట్‌కి అమ్మార‌నే టాక్ వినిపిస్తోంది. ఇటు, ఆంధ్రా, సీడెడ్ క‌లిపి దాదాపు ఇదే రేంజ్‌కి సేల్ అయ్యే చాన్స్ ఉంది. ఇక‌, కర్నాట‌క‌లోనూ బాహుబ‌లి 2ని 25 కోట్ల‌కు కొనుగోలు చేసేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌.

ఇటు త‌మిళ్ వెర్ష‌న్‌కి కూడా రికార్డ్ రేంజ్‌లో డిమాండ్ ఉంది. సుమారు 50కోట్లు ప‌లుకుతోంది.లేటెస్ట్ డెవ‌లప్‌మెంట్ ఏంటంటే.. బాహుబ‌లి 2 హిందీ శాటిలైట్ రైట్స్‌.. ఏకంగా 52 కోట్ల‌కు అమ్ముడుపోవ‌డం. ఇండియాలోనే ఇది రికార్డ్‌. ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ మూవీ సుల్తాన్ కూడా కేవ‌లం 50 కోట్ల‌కే సేల్ అయింది. దానికంటే 2 కోట్లు ఎక్కువ‌గా బాహుబ‌లి 2 ప‌ల‌కడం విశేషం. ఇటు రెస్టాఫ్ ఇండియాలోనూ భారీగా ఆఫ‌ర్‌లు వ‌స్తున్నాయి బాహుబ‌లి 2 రైట్స్ కోసం. మొత్త‌మ్మీద‌, ఇండియాలో ఏ సినిమాకి కూడా లేనంత క్రేజ్‌, జ‌ర‌గ‌నంత బిజినెస్ బాహుబ‌లి 2కి జ‌రుగుతోంది… అందుకే, రాజ‌మౌళి ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా.

Loading...

Leave a Reply

*