బాహుబలుడు ముందే వస్తున్నాడా…?

untitled-5

బాహుబలి సినిమాకు సంబంధించి కేవలం ఇంకొన్ని సన్నివేశాలు, ఓ రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఈమధ్య రాజమౌళి ప్రకటించాడు. సినిమా యూనిట్ నుంచి రానా లాంటి నటులు, తమ పోర్షన్ కంప్లీట్ అయిపోవడంతో ఒక్కకొక్కరుగా తప్పుకుంటున్నారు. డిసెంబర్ చివరినాటికి సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. మరోవైపు ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే హిందీ రైట్స్ తోపాటు.. ఓవర్సీస్ రైట్స్, తమిళ రైట్స్, నైజాం రైట్స్ ను భారీ మొత్తానికి అమ్మేశారు. మరోవైపు కృష్ణా, గుంటూరు హక్కులు కూడా అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బాహుబలి పార్ట్-2కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

అయితే ప్రీ-రిలీజ్ బిజినెస్ తో పాటు షూటింగ్ కూడా దాదాపు ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో… అనుకున్న టైం కంటే కాస్త ముందుగానే సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్నారట. నిజానికి ఈ ప్రపోజల్ తెచ్చింది సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లే అని తెలుస్తోంది. కోట్ల రూపాయలు అడ్వాన్సులుగా ఇచ్చేశాం కాబట్టి కాస్త ముందే సినిమాను రిలీజ్ చేస్తే, కోలుకుంటామని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారట.మరోవైపు ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత కూడా ఎక్కువ గ్యాప్ ఇస్తే, అది పైరసీకి అనుకూలంగా మారుతుందని కూడా చాలామంది అంటున్నారు. ఓవైపు షూటింగ్ క్లయిమాక్స్ కు రావడం, మరోవైపు బిజినెస్ కూడా కంప్లీట్ అవుతుండడంతో… కుదిరితే ఏప్రిల్ 28 కంటే ముందే బాహుబలి-2ను థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట జక్కన్న అండ్ కో.

Loading...

Leave a Reply

*