ఇలా అయితేనే ఉండు… ఐష్‌కి బ‌చ్చ‌న్ ఫ్యామిలీ విడాకుల వార్నింగ్….?

bachchan-family-serious-warning-to-aishwarya-rai

ఐశ్వ‌ర్య‌రాయ్‌.. కెరీర్ ప‌రంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో రెయిజ్ అవుదామ‌నుకున్న ఈ బ్యూటీ.. కుటుంబ ప‌రంగా మాత్రం క‌ష్టాలు కొనితెచ్చుకునేలా చేసింది. గ‌తేడాది ఆమె స‌ర‌బ్‌జీత్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీ కావ‌డంతో ఎలాంటి స‌మ‌స్యా రాలేదు. కానీ, ఈ ఇయ‌ర్‌లో ఆమె యే దిల్ హై ముష్కిల్ అంటూ ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టయిన‌ర్‌లో న‌టించింది. బాలీవుడ్ యువ సూప‌ర్‌స్టార్ ర‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా న‌టించిన ఈ చిత్రం ఈ వీకెండ్ కానుక‌గా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది.

కానీ, ఈ సినిమాలో ఆమె రెచ్చిపోయి న‌టించింద‌నే కామెంట్స్ తెచ్చుకుంది. అంతేకాదు, ఈ మూవీలోని కొన్ని ఎరోటిక్ స‌న్నివేశాల‌ను ఆవిడే కావాల‌ని డిమాండ్ చేసి మ‌రీ పెట్టించుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో, బ‌చ్చ‌న్ ఫ్యామిలీ రంగంలోకి దిగింది. సినిమాలో ఆమె న‌టించిన కొన్ని ఇంటిమేట్ సీన్స్‌ను అమితాబ్ బ‌చ్చ‌న్ సెన్సార్ స‌భ్యుల‌తో మాట్లాడి క‌త్తెర వేయించిన‌ట్లు వార్తలు వ‌చ్చాయి. దీనిపై అప్పుడే ఐష్‌కి త‌మ అస‌హనం, అసంతృప్తి వ్య‌క్తం చేసింద‌ట బ‌చ్చ‌న్ ఫ్యామిలీ. దీనికితోడు, సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఆమె స‌ల్మాన్ ఖాన్ యాంక‌ర్‌గా చేస్తున్న బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సి ఉంది. గ‌తంలో ఐష్‌-స‌ల్మాన్ మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డిచింది. దీంతో, బ‌చ్చ‌న్ ఫ్యామిలీ ఆ షోకి వెళ్లేందుకు అంగీకరించ‌లేదు.

కేవ‌లం ఐష్‌ కోస‌మే బ‌చ్చ‌న్ కుటుంబం స‌ల్మాన్‌కి దూరంగా ఉంటోంది. గ‌తంలో స‌ల్మాన్‌-అమితాబ్ మ‌ధ్య మంచి రిలేష‌న్ ఉంది. అలాంటిది ఐష్ స‌డెన్‌గా స‌ల్మాన్ హోస్ట్ చేస్తున్న షోకి అటెండ‌వ‌డం వారికి న‌చ్చ‌లేదు. అదే విష‌యాన్ని ఆమెకు తెలియ‌జేసింద‌ట‌. మ‌రోవైపు,  జ‌యా బ‌చ్చ‌న్‌తో ఆమెకు కొంత‌కాలంగా స‌ఖ్య‌త లేద‌నే ప్ర‌చారం కూడా ఉంది. దీంతో, సినిమా ప్ర‌మోష‌న్‌కి కూడా దూరంగా ఉండాల‌ని సూచించింద‌ట‌. లేదంటే ప‌రిణామాలు సీరియ‌స్‌గా ఉంటాయ‌ని హెచ్చ‌రిక‌లాంటిది జారీ చేసింద‌ట బ‌చ్చ‌న్ ఫ్యామిలీ. అంతే, ఐష్‌కి వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌లేద‌ట‌. వెంట‌నే యే దిల్ హై ముష్కిల్ సినిమా ప్ర‌మోష‌న్‌కి రాం రాం అని చెప్పిన‌ట్లు స‌మాచారం. మొత్త‌మ్మీద‌, బ‌చ్చ‌న్ ఫ్యామిలీ వార్నింగ్ ఐష్‌కి బాగా ప‌నిచేసింద‌ని తెలుస్తోంది.

Loading...

Leave a Reply

*