రానా, ప్రకాష్ రాజ్ పై ఒకేసారి కేసులు

untitled-9

టాలీవుడ్ భళ్లాలదేవ రానా, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై ఒకేసారి కేసు పడింది. వీళ్లిద్దరూ జాయింగ్ గా ఇప్పుడో కేసులో ఇరుక్కున్నారు. ఇదేదో సినిమాకు సంబంధించిన మేటర్ కాదు. నిజజీవితంలోనే వీళ్లిద్దరిపై కామన్ గా కేసు పడింది. నిజానికి వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయలేదు. కానీ ఓ యాడ్ చేశారు. అదే ఇప్పుడు వీళ్లకు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది.భారత్ లో గ్యాంబ్లింగ్ పై నిషేధం అమల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

కానీ ఆన్ రైన్ గ్యాబ్లింగ్ పై నిషేధం విధించేంతగా రూల్స్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీన్ని ఆసరాగా చేసుకొని ఓ సంస్థ ఆన్ లైన్ రమ్మీని ప్రవేశపెట్టింది. దీనికి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కూడా కల్పిస్తోంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా రానా, ప్రకాష్ రాజ్ ను పెట్టి ఓ యాడ్ కూడా తీసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని టీవీ ఛానెళ్లలో ఈ యాడ్ ప్రసారం అవుతోంది.

తమిళనాడుకు చెందిన ఓ స్వచ్ఛంధ కార్యకర్త ఈ నటులపై పిటిషన్ వేశాడు. ప్రజల్ని తప్పుదోవ పట్టిందే ఇలాంటి యాడ్స్ లో నటించకుండా అడ్డుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశాడు. కోయంబత్తూర్ కు చెందిన ఇళంగోవన్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశాడు. ఆన్ లైన్ రమ్మీ పేరిట మరికొన్ని వెబ్ సైట్స్ కూడా అక్రమంగా రమ్మీ నిర్వహిస్తున్నాయని, వాటిని కూడా రద్దు చేయాలని ఇళంగోవన్ తన పిటిషన్ లో డిమాండ్ చేశాడు.

Loading...

Leave a Reply

*