అర్ధ‌రాత్రి పెళ్ల‌యిన ఆంటీ ఇంట్లో.. బ్యాచిల‌ర్ హీరో…!

untitled-13

మలైకా అరోరా ఖాన్‌.. ఇలా అంటే తెలియ‌దేమో.. కెవ్వుకేక ఐటెం సాంగ్ భామ అంటే ఈజీగా గుర్తు పట్టేస్తారేమో. ఈమె స‌ల్మాన్ ఖాన్ మ‌ర‌ద‌లు. ఆయ‌న సోదరుడు అర్బాజ్ ఖాన్ భార్య‌. ఇటీవ‌ల వాళ్లిద్ద‌రి మ‌ధ్య సంసార జీవితంలో పొర‌పొచ్చాలు వ‌చ్చాయ‌నే ప్రచారం జ‌రిగింది. దీంతో, ఇద్ద‌రూ విడాకులు తీసుకుంటున్నార‌నే రూమ‌ర్ బాగా న‌డిచింది. ఆ దిశ‌గా వెళ్లిన‌ప్ప‌టికీ ఎందుకో బ్రేక్ ప‌డింది. ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త‌తో ఆమెకు అఫైర్ ఉంద‌ని.. మ‌లైకా అరోరా త్వ‌ర‌లోనే అత‌డిని మ్యారేజ్ చేసుకోవ‌డానికి రెడీ అవుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే, తాజాగా వినిపిస్తున్న రూమ‌ర్ ఏంటంటే.. మ‌లైకా అరోరా ఖాన్‌కి.. బాలీవుడ్ యువ హీరో అర్జున్ క‌పూర్‌కి మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌నే మాట వినిపిస్తోంది. ఇది నిన్న‌టిదాకా ప్ర‌చారంగానే ఉన్నా.. తాజాగా ఈ యువ హీరో రాత్రి ప‌ది గంట‌ల స‌మ‌యంలో మ‌లైకా అరోర్ ఖాన్ ఉంటున్న ఇంట్లోకి ప్ర‌వేశించి.. అర్ధ‌రాత్రి ఒక‌టిన్న‌ర దాకా అక్క‌డే ఉండి వ‌చ్చాడు. ముంబైలోని ఓ ఫేమ‌స్ లొకాలిటిలో ఉంటున్న మ‌లైకా అరోర్ ఖాన్ అపార్ట్‌మెంట్‌లోకి అర్జున్ క‌పూర్ రావ‌డం, పోవ‌డం కూడా సీసీటీవీల్లో రికార్డ్ అయింద‌ట‌.

గ‌త కొంత‌కాలంగా వీరిద్ద‌రి మధ్య ప్రేమాయ‌ణం నడుస్తోంద‌ని బాలీవుడ్ గుస‌గుస‌లు పోతోంది. ఇద్ద‌రి మ‌ధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉన్నా వారు ఏమాత్రం ఖాత‌రు చెయ్యడం లేద‌ట‌. త‌మ అనుబంధాన్ని ముందుకు తీసుకుపోవ‌డానికి నిశ్చ‌యించుకున్నార‌ట‌. దీనిపై ఇప్ప‌టికే అర్జున్ క‌పూర్ తండ్రి.. బోనీ క‌పూర్ ఆయ‌న‌ను హెచ్చ‌రించాడని, స‌ల్మాన్ కుటుంబంతో పెట్టుకోవ‌ద్ద‌ని సూచించాడ‌ని, అయినా ఏమాత్రం కేర్ చెయ్య‌డం లేద‌నే క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. మరి, ఈ వ్య‌వ‌హారం ఎలాంటి ట్విస్ట్ తీసుకుంటుందో చూడాలి.

Loading...

Leave a Reply

*