అనుష్క కాబోయే భ‌ర్త‌.. 20వేల కోట్లకు అధిప‌తి..!

anushka

అంద‌రికంటే ముందే అనుష్క పెళ్లి వార్త‌ను బ్రేక్ చేసింది తెలుగుపెన్‌.నెట్‌. ఇప్పుడు అది దాదాపు క‌న్‌ఫ‌మ్ అంటున్నాయి చిత్ర ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు. ఓ చానెల్ మాజీ అధినేత‌తో ఆమె డీప్‌ల‌వ్‌లో మునిగింద‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోంద‌ని కొన్ని రోజులుగా ఓ గాసిప్ ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆయ‌న‌కు ప‌లు ఇండ‌స్ట్రీలు కూడా ఉన్నాయ‌ని, తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌గా ఆయ‌నను చెబుతున్నారు. ఆయ‌న నిర్మాత కూడాన‌ట‌. చిత్ర ప‌రిశ్ర‌మ‌తోనూ ఆయ‌న‌కు అనుబంధం ఉంద‌ట‌. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా ఆయ‌న‌ను అంద‌రూ కీర్తిస్తుంటారు.

అటు రాజ‌కీయంగానూ బొమ్మాళి కాబోయే భ‌ర్త‌కి మంచి ప‌లుకుబ‌డి ఉంద‌ట‌.ఇండ‌స్ట్రీలు పెట్ట‌డం.. వాటిని అమ్మ‌డం.. ఇలా ఆయ‌న వేల కోట్ల సామ్రాజ్యానికి అధిప‌తి అని చెవులు కొరుక్కుంటున్నారు సినీ జ‌నాలు. ఓ హీరోతో అయిన ప‌రిచ‌యం, ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య చిగురించిన బంధం.. ప్ర‌ణ‌యంగా మారి చివ‌రికి పెళ్లిపీట‌లు దాకా వ‌చ్చింద‌ట‌. ఇటు ఇరువైపులా కుటుంబాలు కూడా ఓకే అన‌డంతో త్వ‌ర‌లోనే మ్యారేజ్‌కి రెడీ అవుతున్నార‌ట‌.అనుష్క చేతిలో ప్ర‌స్తుతం బాహుబ‌లి 2తో పాటు మ‌రో చిన్న సినిమాలు రెండున్నాయి.

వాటిని పూర్తి చేసి వ‌చ్చే వేస‌వి నాటికి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. మొత్త‌మ్మీద‌, నిన్న‌టిదాకా చైతు-స‌మంత మ్యారేజ్‌పై సోష‌ల్ మీడియా హోరెత్తింది. వారి మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది. త్వ‌రలోనే వారి పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. తాజాగా ఇప్పుడు ఆ హెడ్ లైన్స్‌ను అనుష్క అందిపుచ్చుకుందంటున్నారు గాసిప్ రాయుళ్లు. బొమ్మాళి త్వ‌ర‌లోనే పెళ్లికూతురు కాబోంద‌న్న‌మాట‌. అయితే, ఇన్నాళ్లూ అనుష్క‌పై వెలుగు చూసిన రూమ‌ర్‌ల‌లా ఇది కూడా గాసిప్‌గానే మిగులుతుందా..? లేదా? అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

Loading...

Leave a Reply

*