ఆ వార్త విని బోరున ఏడ్చిన బొమ్మాళి..!

anush

ఇండ‌స్ట్రీలో రూమ‌ర్‌లు అనేవి కామ‌న్‌. కాయ‌లున్న చెట్టుకి రాళ్లు ఎలా వేస్తారో.. క్రేజ్ ఉన్న హీరో హీరోయిన్‌లు, ద‌ర్శ‌కుల‌పైనా అంత‌కంటే గొప్ప ప్ర‌చారం జ‌రుగుతుంది. వారి స‌క్సెస్ ఫెయిల్యూర్ స్టోరీలే కాదు.. ప‌ర్స‌నల్ లైఫ్‌కి సంబంధించిన మేట‌ర్ కూడా ఎంతో ఆస‌క్తిక‌రంగా మారుతుంది. దానిని క్యాష్ చేసుకోవ‌డానికి గాసిప్ రాయుళ్లు తెగ హడావిడి చేస్తారు. వారి అఫైర్‌లు, ల‌వ్ సీక్రెట్‌లు అంటూ లేని వార్త‌లు క్రియేట్ చేసి మ‌రీ రాస్తారు.అనుష్క‌కు ఇలాంటి వార్త‌లు కొత్త‌కాదు. ఆమె కెరీర్ ప్రారంభం నుంచే ఎన్నో ర‌కాల రూమర్‌లు వినిపించాయి. ప్ర‌భాస్‌, నాగచైత‌న్య‌, గోపీచంద్‌, నాగ్ వంటి హీరోల‌తో పాటు క్రిష్ వంటి డైరెక్ట‌ర్‌ల‌తోనూ అఫైర్‌లు అంటూ గాసిప్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

అయితే, అవి అబద్ధ‌మ‌ని తేలిపోయింది. కొన్నింటిపై బొమ్మాళి క్లారిటీ ఇచ్చినా.. కొన్ని రూమ‌ర్‌ల‌పై ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మే లేకుండా పోయింది.వీట‌న్నింటినీ ప‌క్క‌న‌పెడితే రీసెంట్‌గా వినిపించిన ఓ పుకారు అనుష్క‌ను ఏడిపిచింది. టాలీవుడ్‌లోని ఓ సీనియ‌ర్‌, బడా నిర్మాత‌తో ఆమెకు అఫైర్ ఉంద‌ని, త్వ‌ర‌లోనే వాళ్లిద్ద‌రూ మ్యారేజ్‌కి రెడీ అవుతున్నార‌నే రూమ‌ర్ కొన్నాళ్లుగా మీడియాలో హాట్‌హాట్‌గా న‌డుస్తోంది. నిన్న‌టిదాకా వెబ్ మీడియాకి మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ వార్త‌.. తాజాగా మెయిన్‌స్ట్రీమ్ మీడియాకీ ఎక్కింది. అంతే, విష‌యం అనుష్క దాకా రావ‌డంతో ఆ న్యూస్ విని…

అనుష్క ఒక్క‌సారిగా బోరున ఏడ్చింద‌ట‌. క‌న్నీటి ప‌ర్యంత‌మ‌యింద‌ట‌. దీనిపై త‌న సన్నిహితుల‌తో చెప్పుకొని బోరున విల‌పించింద‌ట‌.2017లో త‌న పెళ్లి చెయ్య‌డానికి కుటుంబ స‌భ్యులు రెడీ అవుతున్నార‌నే మాట వాస్త‌వ‌మే కానీ.. త‌న‌కేమీ సంబంధంలేని వార్త‌ల‌ను రాయ‌డం ప‌ట్ల బొమ్మాళికి ప‌ట్ట‌రానంత కోపం, దుఃఖం వ‌చ్చాయట‌. అందుకే, ఏడ్చేసిందని ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. అయితే, దీనిపై వివ‌ర‌ణ ఇవ్వ‌డానికి ఆమె మీడియా ముందుకు వ‌స్తుందా? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

Loading...

Leave a Reply

*