త్రివిక్ర‌మ్ ఆ హీరోయిన్‌పై మ‌న‌సు పడ్డాడ‌ట‌…!

untitled-2

త్రివిక్ర‌మ్‌.. తొంద‌ర‌గా ఎవ‌రితోనూ సినిమాలు చెయ్య‌డు. ఆయ‌న‌కు న‌చ్చితేనే, వేవ్ లెంగ్త్ క‌లిస్తేనే కానీ.. సినిమా చెయ్య‌డానికి అంగీక‌రించడు. హీరోల‌యినా, హీరోయిన్‌లయినా ఆయ‌న అంతే. అందుకే, ఆ ముగ్గురు బ‌డా హీరోల‌తోనే రిపీటెడ్‌గా సినిమాలు చేస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు. కుదిరితే ప‌వ‌న్ లేదంటే మ‌హేష్‌.. వీల‌యితే అల్లు అర్జున్‌.. ఇదీ ఆయ‌న వ‌ర‌స‌. ఇక, హీరోయిన్‌ల విష‌యంలోనూ త్రివిక్ర‌మ్‌ది ఇదే రూట్ అట‌.

కెరీర్ ప్రారంభంలో ఆయ‌నకు ఇలియాన బాగా న‌చ్చింది. అందుకే, ఆమెతో రెండు సినిమాలు చేశాడు మాట‌ల మాంత్రికుడు. జ‌ల్సాతోపాటు.. జులాయి చిత్రాల‌లో గోవా బ్యూటీకి చాన్స్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఆయ‌న ఫోక‌స్ స‌మంత‌పై ప‌డింది. త్రివిక్ర‌మ్ సినిమా అంటే చుల్‌బులీ కేరాఫ్‌గా మారింది. అత్తారింటికి దారేది, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి… అ.. ఆ. ఇలా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో ఆమెనే రిపీట్ చేశాడు. ఇక‌, అ.. ఆ సినిమా అయితే, ఆమె కోస‌మే చేశాడ‌నే టాక్ కూడా ఉంది.

స‌మంత‌కు హ్యాట్రిక్ అందించిన త్రివిక్ర‌మ్‌..ప‌వ‌న్‌తో చేస్తున్న కొత్త చిత్రంలోనూ ఆమెనే తీసుకోవాల‌ని భావించాడు. కానీ, స‌మంత కోలీవుడ్ చిత్రాల‌కే సైన్ చేస్తోంది. టాలీవుడ్‌కి నో అంటోంది. దీని వెనుక లాజిక్ ఏంటో తెలియ‌దు కానీ, చుల్‌బులీ నో అన‌డంతో ఆయ‌న మ‌రో భామ‌కు చాన్స్ ఇస్తున్నాడ‌ట‌. ఆమె ఎవ‌రో కాదు.. టాలీవుడ్‌కి త్రివిక్ర‌మ్ ప‌రిచ‌యం చేసిన అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఈ మ‌ల‌యాళీ బ్యూటీ.. అ.. ఆ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. అందుకే, మ‌రోసారి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కి క‌మిట్ అయ్యాడ‌ని స‌మాచారం. ఇద్ద‌రు హీరోయిన్‌లలో ఆమె ఒక‌ర‌ట‌. మ‌రి, స‌మంత కోసం ఫస్ట్ హీరోయిన్ ప్లేస్‌ని త్రివిక్ర‌మ్ ఖాళీగా ఉంచాడా..? అది త్వ‌ర‌లోనే తేల‌నుంది. త్రివిక్ర‌మ్‌… తాజాగా అనుప‌మ‌పై మ‌న‌సు ప‌డ్డాడ‌న్న‌మాట‌. ఆమెకి ఎన్ని చాన్స్‌లు ఇస్తాడో చూడాలి.

 

Loading...

Leave a Reply

*