జ‌న‌తా గ్యారేజ్‌పై అనుప‌మ సెటైర్‌లు…!

anupama

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.. టాలీవుడ్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న బ్యూటీ. ఈ ఏడాది.. అ..ఆ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ కేర‌ళ కుట్టి. ఆ త‌ర్వాత తెలుగులో ప్రేమ‌మ్ మూవీని ద‌క్కించుకుంది. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన ప్రేమ‌మ్‌కి ఇది రీమేక్‌. మ‌ల‌యాళంలో ఆమె పోషించిన మేరి జార్జి పాత్ర ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయింది. అంతే, ఓవ‌ర్‌నైట్ అక్క‌డ ఆమె స్టార్‌గా మారింది. అదే రోల్‌ని తెలుగులోనూ పోషిస్తోంది ఈ బ్యూటీ. ఈ పాత్ర త‌న కెరీర్‌ని మార్చివేస్తుంద‌ని, టాలీవుడ్‌లో త‌నకు పాపులారిటీ వ‌స్తుంద‌ని ధీమాగా ఉంది అనుప‌మ‌.

ఇదిలా ఉంటే.. జ‌న‌తా గ్యారేజ్‌పై ఆమె చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అనుప‌మ ఇటీవ‌ల మీడియాకి ఇంట‌ర్‌వ్యూ ఇచ్చింది. ఈ ప్రెస్ మీట్‌లో ఆమె రీసెంట్‌గా జ‌న‌తా గ్యారేజ్ చూశాన‌ని.. ఆ సినిమా త‌న‌కు అర్ధం కాలేదని, డైలాగులు కూడా అంత‌గా అర్ధం కాలేద‌ని తెలిపింది. అంటే, ఆమె తెలుగు వెర్ష‌న్ చూసి ఇలా అందా..?  లేక మ‌ల‌యాళం మూవీ చూసి ఇలా వ్యాఖ్యానించిందా..? అనేది హాట్ టాపిక్‌గా మారింది. లేకుంటే, ఈ సినిమా ఇంత పెద్ద హిట్ ఎలా అయింది..? అని కామెంట్ చేసిందా..? అనేది కూడా స‌స్పెన్స్‌గా మారింది.

అక్క‌డితో ఆగలేదు.. ప్రేమ‌మ్ త‌ర్వాత తాను తెలుగులో మంచి కేర‌క్ట‌ర్‌లే చేస్తాన‌ని, డ‌బ్బులు కోసం ఏ రోల్ ప‌డితే అది చెయ్య‌న‌ని తెలిపింది. త‌న‌కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర‌ల‌యితేనే చేస్తాన‌ని వివ‌రించింది. అంటే.. జ‌న‌తా గ్యారేజ్‌లో హీరోయిన్ కేర‌క్ట‌ర్‌లు వీక్‌గా ఉన్నాయ‌నే కామెంట్స్‌ను ఆమె ఇలా వ్యాఖ్యానించింద‌ని కొంద‌రంటున్నారు. ఇందులో నిజ‌మెంత అనేది ఆమెకే ఎరుక‌. ఇలా అయితే, అనుప‌మ‌కి కాస్త క‌ష్ట‌మేనంటున్నారు విమ‌ర్శ‌కులు. మ‌రో నిత్యామీన‌న్‌లా మారాల‌నుకుంటుందా? అని రివ‌ర్స్‌లో సెటైర్‌లు వేస్తున్నారు.

Loading...

Leave a Reply

*