చైతూ చెంతకు మరో రీమేక్

chaitu

ఇప్పుడిప్పుడే రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాడు నాగచైతన్య. తన మామ వెంకటేశ్ కు మాత్రమే సొంతమైన రీమేక్ రాజా ఇమేజ్ ను తను కూడా దక్కించుకోవాలని చూస్తున్నాడు. దీనికి తొలి అడుగు ప్రేమమ్ సినిమా. మలయాళంలో క్లాసికల్ మూవీగా, ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో విడుదల చేశాడు చైతూ. ఈ రీమేక్ తో ఓ మంచి హిట్ అందుకున్నాడు.ప్రేమమ్ హిట్ తో చైతూకు మళ్లీ అలాంటి రీమేక్ సినిమాలే వరుసగా వస్తున్నాయి. అయితే అన్నీ సూపర్ హిట్ సినిమాలు, సెన్సిబుల్ మూవీసే కావడం విశేషం. తాజాగా బాలీవుడ్ లో హిట్ అయిన 2-స్టేట్స్ సినిమా రీమేక్ చైతూ చెంతకు చేరింది.

తెలుగులో ఈ మూవీ రీమేక్ రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ దక్కించుకుంది. ఇప్పుడు నాగచైతన్య-సమంత హీరోహీరోయిన్లుగా ఆ సినిమాను రీమేక్ చేయాలనుకుంటోంది.నిజాకి 2-స్టేట్స్ సినిమా చాలా బాగుంటుందని, కానీ ఆ ఆఫర్ మాత్రం ఇంకా తనవరకు రాలేదని నాగచైతన్య ఈమధ్య స్పష్టంచేశాడు. కానీ ప్రేమమ్ విడుదలైన కొన్ని గంటల్లోనే అభిషేక్ పిక్చర్స్ ప్రతినిధులు… 2-స్టేట్స్ రీమేక్ తో నాగచైతన్యను సంప్రదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య 2 సినిమాలకు కమిట్ అయ్యాడు. కల్యాణ్ కృష్ణ, ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత 2-స్టేట్స్ రీమేక్ పై ఆలోచిస్తాడు.

Loading...

Leave a Reply

*