పవన్ సినిమాకు కుర్ర మ్యూజిక్ డైరక్టర్

untitled-1

గతంలో ఎన్నోసార్లు తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి ట్రైచేశాడు. అప్పట్లో అ..ఆ సినిమాకు మొదట అనిరుధ్ నే మ్యూజిక్ డైరక్టర్ అనుకున్నారు. ఈ పిల్ల కంపోజర్ కొన్ని పాటలు కూడా కంపోజ్ చేశాడు. కానీ ఆఖరి నిమిషంలో అనిరుథ్ ను తీసేసి, మిక్కీ జే మేయర్ ను పెట్టుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. అదే టైమ్ లో అనిరుధ్ కు చెర్రీ కూడా హ్యాండ్ ఇచ్చాడు. బ్రూస్ లీ సినిమా నుంచి పక్కకు జరిపాడు.తాజాగా తెరకెక్కుతున్న ధృవ సినిమా కూడా అనిరుథ్ చేయాల్సిన ప్రాజెక్టే. కానీ ఆ ప్రాజెక్టు కూడా అనిరుథ్ చేజారిపోయింది.

ఇలా వరుసగా టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు కోల్పోతున్న అనిరుథ్.. ఎట్టకేలకు ఓ ఆఫర్ దక్కించుకోగలిగాడు. అది కూడా అలాంటిలాంటి ఆఫర్ కాదు. ఏకంగా పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందించే గోల్డెన్ ఛాన్స్ అందుకున్నాడు. అవును.. వచ్చేనెల నుంచి సెట్స్ పైకి రాబోతున్న పవన్-త్రివిక్రమ్ సినిమాకు అనిరుథ్ సంగీతం అందించబోతున్నాడు.

ఈ విషయాన్ని అనిరుథ్ స్వయంగా ప్రకటించాడు. తన బర్త్ డే సందర్భంగా ఓ ప్రముఖ తమిళ మేగజైన్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, అనిరుథ్ ఈ విషయాన్ని బయటపెట్టాడు. గతంలో ఇతడు కంపోజ్ చేసిన ఓ పాట తమిళనాట తీవ్ర దుమారం రేపింది. మహిళల్ని కించపరిచేలా ఆ పాట ఉంది. ఆ దుమారానికి భయపడే.. తెలుగులో అతడికి ఎవరూ అవకాశం ఇవ్వలేదు. మళ్లీ ఇప్పుడిప్పుడే అనిరుథ్ వైపు చూస్తున్నారు.

Loading...

Leave a Reply

*