నాగ్‌కి నిద్ర‌ప‌ట్ట‌కుండా చేసిన మాజీ యాంక‌ర్‌.. మేట‌రేంటి…?

nag

టాలీవుడ్ మ‌న్మ‌ధుడు.. అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు.. గ్రీకువీరుడు. నాటికి, నేటికి టాలీవుడ్ సోగ్గాడు ఆయ‌నే. అలాంటి నాగ్‌కి రీసెంట్‌గా ఓ యాంక‌ర్ నిద్ర పట్ట‌కుండా చేశాడ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే ఒప్పుకున్నాడు. ఆయ‌న‌కే నిద్ర‌లేని రాత్రుల‌కు గురిచేసిన యాంక‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? అయితే, ఈ స్టోరీ చ‌ద‌వండి..నాగార్జున ప్ర‌స్తుతం న‌మో వెంక‌శాయ మూవీ చేస్తున్నాడు. అన్న‌మ‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడీ సాయిలా ఇది కూడా పూర్తి ఆధ్యాత్మిక చిత్రం. ఈ మూవీలో నాగ్‌… హాథీరామ్‌జీ బాబాగా న‌టిస్తున్నాడు.

వెంక‌టేశ్వ‌ర స్వామి ప‌ర‌మ భ‌క్తుడైన హాథీరామ్ జీ బాబా జీవితగాథ ఆధారంగా తెర‌కెక్కుతోంది ఈ మూవీ. నాగ్ కెరీర్‌లో ఇదో వైవిధ్య‌మైన సినిమాగా తెర‌కెక్కుతోంది. రీసెంట్‌గా సినిమాల క‌థ‌లు, కేర‌క్ట‌ర్‌ల ప్ర‌యోగాలు చేస్తున్న నాగ్‌.. ఓం న‌మో వెంక‌టేశాయ త‌ర్వాత మ‌రో ఎక్స్‌పెరిమెంట్‌కి సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌. అదేంటంటే.. స‌స్పెన్స్ హార‌ర్ కామెడీలో న‌టించేందుకు రెడీ అవుతున్నాడ‌ని స‌మాచారం.అదే రాజుగారి గ‌ది సీక్వెల్‌. ఈసినిమా క‌థ ఓంకార్ చెప్పిన త‌ర్వాత నుంచి నాగ్‌కి స‌రిగ్గా నిద్ర కూడా ప‌ట్ట‌డం లేద‌ట‌. ఆ క‌థ‌లో ఎప్పుడు నటిద్దామా..? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడ‌ట‌. ఈ స్టోరీని చెప్పింది ఎవ‌రో కాదు.

మాజీ యాంక‌ర్, ప్రెజెంట్ డైరెక్ట‌ర్‌గా అవ‌తార‌మెత్తిన ఓంకార్ అన్న‌య్య‌. అవును, రాజుగారి గ‌ది సినిమా గ‌తేడాది భారీ విజ‌యం సాధించింది. దానికి సీక్వెల్ స్టోరీనే ఇది. ఈ క‌థ కూడా అద్భుతంగా వ‌చ్చింద‌ట‌. అందుకే, స్టోరీ విని నాగ్ థ్రిల్ ఫీల‌య్యాడ‌ట‌. మ‌రి, ఆయ‌న ఓకే అంటే.. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది ఈ మూవీ. సోగ్గాడే చిన్ని నాయ‌న‌, ఊపిరి, ఓం న‌మో వెంక‌టేశాయ త‌ర్వాత నాగ్ నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన మూవీ రానుంద‌న్న‌మాట‌.

Loading...

Leave a Reply

*