అన‌సూయ చ‌క్ర‌బంధంలో విల‌విల్లాడిన చైతూ

anu-and-chaitu

ఆడవారి మాట‌ల‌కు అర్థాలే వేరులే… అన‌సూయ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు క‌ష్టంలే అంటూ పాడుకుంటున్నాడు చైతూ… హాట్ యాంక‌ర్ అన‌సూయ చ‌క్ర‌బంధంలో చిక్కిన నాగ‌చైత‌న్య ప‌రేషాన్ అయిపోయాడు… ఎర‌క్క‌పోయి అన‌సూయ‌తో డేట్ చేశాను… ఇప్పుడు ఇరుక్కు పోయాను అంటూ చైతూ విల‌విల్లాడిపోతున్నాట్ట‌… స‌మంత గురించి ఇన్నాళ్లు ఎవ్వ‌రికి చెప్ప‌కుండా చైతూ దాచుకున్న ర‌హ‌స్యాల‌ను చేతిలో చెయ్యేసి మ‌రీ చెప్పించిందిట అన‌సూయ‌… హీరోయిన్ల‌కే అసూయ పుట్టించే అంద‌గ‌త్తె అన‌సూయ ప్ర‌శ్న‌ల‌కు చైతూ ఉక్కిరిబిక్కిరి అయిపోయాట్ట‌…. ఈమ‌ధ్య ఎక్క‌డ చూసినా స‌మంత చైతూల పెళ్లి విష‌యాలే హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.. పేప‌ర్ల‌లోను చానెళ్ల‌లోనే అదే హోరెత్తుతోంది…

అయినా ఈ విష‌యంపై చైతూ స‌మంత ఇద్ద‌రు పెద‌వి విప్ప‌క‌పోవ‌డంతో ఇది మ‌రింత మ‌ధుర‌మైన స‌స్పెన్స్‌గా మారింది… ఈ నేప‌థ్యంలో అద‌ర‌గొట్టే యాంక‌ర్ అనసూయ నాగ‌చైత‌న్య‌తో ఓ ప్రోగ్రామ్ చేసింది… అదే ఈమ‌ధ్య పాపుల‌ర్ అయిన డేట్ విత్ అన‌సూయ కార్య‌క్ర‌మం… ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా చైతూను త‌న చ‌క్ర‌బంధంలో ఇరికించింది అనసూయ‌… ఈ ప్రోగ్రామ్‌లో నాగ‌చైత‌న్య అన‌సూయ‌కు పూర్తిగా దొరికిపోయాట్ట‌… వ‌గ‌లు వ‌లికిస్తూ హొయ‌లు ప‌లికిస్తూ ముద్దుముద్దుగా అన‌సూయ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సూటిగా స‌మాధానం చెప్ప‌లేక‌, ర‌హ‌స్యాల‌ను త‌న గుండెల్లో దాచుకోలేక చైతూ గిల‌గిల్లాడుట‌….

ఇంత‌కీ చైతూ గుట్టు అన‌సూయ పూర్తిగా విప్పిందా లేదా?.. ఇదే అక్కినేని అభిమానుల్లో అమితాస‌క్తిని రేకెత్తిస్తోంది… స‌మంత‌, చైతూల్లో ముందు ఎవ‌రు ప్ర‌పోజ్ చేశారు… వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌బంధం ఎలా అల్లుకుంది…దానిలో ఎలాంటి మ‌లుపులు ఉన్నాయి… స‌మంత మ‌తం మారిందా లేదా…. ఇలాంటి ప్ర‌శ్న‌ల‌న్నింటికి స‌మాధానం కావాలంటేవీకెండ్‌లో ప్ర‌ముఖ న్యూస్ చానెల్‌లో వ‌చ్చే ఈ ప్రోగ్రామ్ చూస్తే గానీ తెలియ‌దు…హాట్ అన‌సూయ చైతూను త‌న ప్ర‌శ్న‌ల‌తో ఎంతగా వేపుకుతిందో చూస్తే కానీ అర్థం కాదు.

Loading...

Leave a Reply

*