ఆమెకి ప‌బ్లిక్‌గా లిప్‌కిస్ ఇచ్చి ర‌చ్చ చేసిన అమీర్ ఖాన్‌…!

amir-khan

అమీర్ ఖాన్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఈత‌రంలో షారుక్‌, స‌ల్మాన్ త‌ర‌వాత ది మోస్ట్ పాపుల‌ర్ హీరో. అయితే, క‌లెక్ష‌న్‌లు, రికార్డ్‌ల ప‌రంగా ఆయ‌నే ఇండియాలో నెంబ‌ర్ వ‌న్. గ‌త కొన్నాళ్లుగా బాలీవుడ్ రికార్డ్‌ల‌న్నీ త‌న పేరు మీద‌నే రాసుకుంటున్నాడు. పీకేతో ఇండియాలోనే హ‌య్య‌స్ట్ గ్రాస్ మూవీగా రికార్డ్‌లు సాధించాడు. రాజ్‌కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పీకే.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 800 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఇది ఓ రికార్డ్‌. ఇక‌, తాజాగా విడుద‌ల‌యిన దంగాల్ ట్ర‌యిల‌ర్‌ని ఒక్క‌రోజులోనే 89ల‌క్ష‌ల మంది వీక్షించారు. ఇది కూడా ఓ సంచ‌ల‌నం.

ఇవన్నీ బాగానే ఉన్నా.. అమీర్ ఖాన్ రీసెంట్‌గా చేసిన ప‌నితో మ‌రోసారి న్యూస్‌లో హెడ్‌లైన్‌గా మారాడు. మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్ట్‌గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్‌.. ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌ల‌లోనూ, ఈవెంట్స్‌లోనూ హుందాగా ప్ర‌వ‌ర్తిస్తారు. ఎంతో డీసెంట్‌గా ఉంటారు. కానీ, గురువారం ముంబైలో జ‌రిగిన మామి ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఆయ‌న కాస్త శృతి మించాడ‌నే విమ‌ర్శ‌లు తెచ్చుకున్నాడు. ఆయ‌న ప‌బ్లిక్‌గా త‌న భార్య‌ను లిప్ కిస్ పెట్టుకోవ‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.అంద‌రూ చూస్తుండ‌గానే త‌న భార్య కిరణ్ రావ్ పెదాల‌ను అధ‌ర చుంబ‌నం చెయ్య‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

విదేశాల‌లో జ‌రిగే ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో మ‌నం ఇలాంటి అధ‌ర చుంబ‌న దృశ్యాల‌ను చూస్తుంటాం. కానీ, ఇండియాలో ఇలా ప‌బ్లిక్‌గా ఓపెన్‌గా కిస్ చెయ్య‌డం మొద‌టిసారి. మొన్న‌టికి మొన్న దేశంలో అస‌హ‌నం పెరిగిపోయిందని, దేశం విడిచిపోవాల‌ని ఉందంటూ అమీర్ ఖాన్ చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే రేపాయి. ఆ హ‌డావిడి కాస్త త‌గ్గింది. ఇప్పుడు ఇలా కిస్ సీన్‌తో మ‌రోసారి కాంట్ర‌వ‌ర్శీకి కేరాఫ్‌గా మారాడు అమీర్ ఖాన్‌. మ‌రి, దీనిని హిందూ మ‌త వాదులు, స‌నాత‌న సాంప్ర‌దాయ వాదులు లైట్‌గా తీసుకుంటారా..? అనేది చూడాలి.

Loading...

Leave a Reply

*