ప‌వ‌న్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ హీరోయిన్‌.. ఇలా రెచ్చిపోయింది..!

amisha

ఈమెని గుర్తుప‌ట్టారా..? అవును, మీ గెస్ క‌రెక్టే.. అమీషా ప‌టేల్. బాలీవుడ్ మిస్ట‌ర్ హ్యాండ్‌స‌మ్ హృతిక్ రోష‌న్ మూవీ క‌హో నా ప్యార్ హై చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే భారీ క్రేజ్ తెచ్చుకుంది. అదే ఊపుతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ పాల బుగ్గ‌ల బ్యూటీ. ప‌వ‌న్ హీరోగా న‌టించిన బ‌ద్రి సినిమాలో రేణూ దేశాయ్‌తోపాటు ఈమె మ‌రో హీరోయిన్‌. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ స‌ర‌స‌న నర‌సింహుడులో న‌టించింది. ఆ వెంట‌న మహేష్ బాబు ప్ర‌యోగాత్మ‌క చిత్రం నానిలోనూ యాక్ట్ చేసింది. ఇలా టాలీవుడ్‌లో ముగ్గురు బ‌డా హీరోలతో జోడీక‌ట్టినా స‌రైన చాన్స్‌లు రాక‌పోవ‌డంతో హిందీకే ప‌రిమిత‌మ‌యింది ఈ భామ‌.ఆ మ‌ధ్య ఓ ద‌ర్శ‌కనిర్మాత‌తో ల‌వ్ అఫైర్ విష‌యంలో ఇంట్లో వాళ్ల‌తో గొడ‌వ‌ప‌డి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

ఇటు, బాలీవుడ్‌లోనూ ఆఫ‌ర్‌లు రాక‌పోవ‌డంతో ఆమె ఇలా ఫోటో షూట్‌లు, సెల్ఫీల‌తో ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఏ ఒక్క నిర్మాత కంట్లో ప‌డినా.. త‌న‌కు చాన్స్‌లు ఇవ్వ‌క‌పోతారా అని భావిస్తున్న‌ట్లుంది ఇలా హాట్ హాట్‌గా ఫోటోలు తీసి ట్విట్ట‌ర్‌తోపాటు త‌న సోష‌ల్ మీడియా గ్రూప్‌లలో షేర్ చేస్తోంది. అయితే, నిన్న‌టిదాకా ఓ వెలుగు వెలిగిన ఈ భామ స‌డెన్‌గా ఇలా మార‌డంతో కొంద‌రు ట్విట్ట‌ర్ వేదిక‌గానే జోకులు వేస్తున్నారు. అంతేకాదండోయ్‌, ఆ మ‌ధ్య నిర్మాతగా ఓ సినిమా చేసి చేతులు కాల్చుకుంది. మ‌రి, ఇలాంటి ఫోటోల‌తో ఆమెకు చాన్స్‌లు రావడం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే.. అమీషాకు పూన‌మ్ పాండే వంటి సోష‌ల్ మీడియా సెల‌బ్రిటీల స‌ర‌స‌న ర్యాంక్ రావ‌డం గ్యారంటీ అంటున్నారు కొంద‌రు.

Loading...

Leave a Reply

*